
సికింద్రాబాద్
సికింద్రాబాద్ సివిల్ కోర్టుకు బాంబ్ బెదిరింపు ఈ మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబు ఉందన్న సమాచారం రావడంతో న్యాయవాదులు హుటాహుటిన కోర్టు నుండి బయటకు వచ్చారు. వెంటనే మారేడుపల్లి పోలీసులు సికింద్రాబాద్ సివిల్ కోర్టు చేరుకొని తనిఖీలు చేపట్టారు. డాగ్ బాంబు స్క్వాడ్ తో కోర్టు ప్రాంగణంతోపాటు కోర్టు హాలులో తనిఖీలు చేశారు. చివరికి బాంబు లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నగరంలోని పలు సివిల్ కోర్టులకు ఇదే తరహా ఈమెయిల్ రావడంతో న్యాయవాదులు న్యాయమూర్తులు భయాందోళనకు గురయ్యారు. ఎవరైతే ఈమెయిల్ పంపారో వారిని గుర్తించి పోలీసులు చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు.