YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

73 రూపాయిలకు దిగొచ్చిన పెట్రోల్

73 రూపాయిలకు దిగొచ్చిన పెట్రోల్
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పతనం కొనసాగుతూనే ఉంది. దీంతో దేశీయంగానూ పెట్రోలు ధరలు మరింతగా తగ్గుతున్నాయి. వారం రోజుల్లో మూడుసార్లు అత్యంత కనిష్ఠానికి చేరిన పెట్రోలు ధరలు ఏడాది చివరిరోజైన సోమవారం (డిసెంబరు 31) కూడా మరో కనిష్ఠ రికార్డును నమోదుచేసింది. డిసెంబరు నెల మొత్తంలో పెట్రోలు ధరలు రూ.4 వరకు తగ్గింది. పెట్రోలు ధరల తగ్గుదల మొదలైన అక్టోబరు 18 నుంచి చూస్తే పెట్రోలు ధర దాదాపు రూ.14 వరకు తగ్గింది. డీజిల్‌ది కూడా దాదాపు ఇదే పరిస్థితి. సోమవారం మరోసారి తగ్గిన ఇంధన ధరలతో.. దీంతో దేశరాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర 20 పైసలు తగ్గి రూ.68.84 కి చేరగా.. డీజిల్ ధర 23 పైసలు తగ్గి రూ.62.86 కి చేరింది. వాణిజ్య రాజధాని ముంబయిలోనూ 20 పైసలు తగ్గిన పెట్రోలు ధర రూ.74.47 చేరగా.. డీజిల్ ధర 25 పైసలు తగ్గి 65.76 కి చేరింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయాన్నికొస్తే.. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర 21 పైసలు తగ్గి రూ.73.01 వద్ద, డీజిల్ ధర 25 పైసలు తగ్గి రూ.68.32 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.72.57 ఉండగా, డీజిల్ ధర రూ.67.54 వద్ద కొనసాగుతోంది. 

Related Posts