YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

ఓంకార రహస్యములు

ఓంకార రహస్యములు

ఓంకారాన్ని గురించి తెలుసుకోవాలన్న... దానిని అర్ధం చేసుకోవాలన్న... ఆచరించాలన్న మనకు ఒక అర్హత అవసరం... అందుకే మన హిందూ ధర్మాలలో మంత్రోపదేశం చేయటం చాల జాగ్రత్తగా చేస్తారు... ఒక రహస్యాన్ని రహస్యంగా కాపాడడంలో విశిష్టత ఉంది..

ఓంకారాన్ని గురించి వినడం  ఒక ఎత్తు ... అర్ధం చేసుకోవడం ఒక ఎత్తు.... ఓంకారాన్ని స్పష్టం గ ఉచ్చరించి దానిని అనుభూతి పొందడం ఒక ఎత్తు..... ఆ అనుభవాన్ని మీరూ స్వంతం చేసుకోండి...

ఓంకారం సంస్కృతంలో ''ॐ''అక్షరం దైవంతో సమానం
ఓంకారమనేది.....చాల మంది అనుకునే విధంగా "ఓ" అనే అక్షరం తో ప్రారంభమయి "0" తో ముగిసేది కాదు...
ఇది 3 అక్షరముల సంగమం ... అవి ఆ + ఊ  + మ్
ఆ --- అనే అక్షరాన్ని నాభి స్థానం నుండి ఉచ్చరించాలి.... అంటే మనం ఈ అక్షరాన్ని పలికేది గొంతు నుండి  అయిన భావన నాభి (బొడ్డు) (స్వాధిష్టాన చక్రం)  దగ్గర మొదలవ్వాలి...
ఊ --  ఈ అక్షరం గొంతు (విశుద్ధ చక్రం) నుండి ఉచ్చరించాలి...
మ్ - ఈ అక్షర ఉచ్చారణ మన శీర్శాగ్రం (సహస్రార చక్రం )  నుండి వెళ్లి పోవాలి...
స్వాధిష్టాన చక్రం -- అధిపతి.. బ్రహ్మ... అనగా సృష్టి....
విశుద్ధ చక్రం... అధిపతి... విష్ణు... అనగా స్థితి...
సహస్రారం.. అధిపతి.... శివుడు... అనగా... లయ ...
ఓంకార సృష్టి నాభి దగ్గర... మొదలయి... స్థితి... గొంతు దగ్గర ఉండి... శీర్శగ్రం దగ్గర లయం కావాలి...
ఈ మూడు అక్షరాలను జాగ్రత్తగా ఉచ్చారించటం వలన మన లోని 3 చక్రాల గుండా cosmic  energy ... మూల శక్తితో సహస్రారం ద్వార sinchronize  అవుతుంది...
అపుడు శరీరం లో కలిగే నిజమయిన ప్రకంపనాలను మాటలలో వర్ణించ లేము....
(జ్ఞానేంద్రియాలకు అతీతమయిన వాటిని మాటలలో బోధించలేము... )

ఈ విధంగా కనీసం 7 సార్లు ఉచ్చరించి చూడండి..

ఈ క్రింది సూచనలు పాటించండి:
ఒకసారి పూర్తి ఉచ్ఛారణకు కనీసం 10 సెకన్ల నుండి 13 సెకన్ల సమయం పడుతుంది... ఒక సారి పూర్తి ఊపిరి తీసుకున్న తర్వాత.. ఉచ్చారణ మొదలు పెట్టండి... బయటకు స్పష్టంగా పలకండి...( లోలోపల మననం చేసుకోవద్దు... )
3 అక్షరాలకు సమమయిన ప్రధాన్యతనివ్వండి... దీనిలో కూడా రహస్యముంది...

ఓం తత్సత్

Related Posts