YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

ఫైనాన్షియల్ స్ట్రైక్ తో పాక్ విలవిల

ఫైనాన్షియల్ స్ట్రైక్ తో పాక్ విలవిల

న్యూఢిల్లీ, మే 3, 
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం సమీపంలోని బైసరన్‌ లోయలో ఏప్రిల్‌ 22, 2025న జరిగిన ఉగ్రదాడి భారత్‌–పాకిస్థాన్‌ సంబంధాలను మరింత దిగజార్చింది. ఈ దాడిలో 26 మంది, ప్రధానంగా పర్యాటకులు, ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వెనుక పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబాతో అనుబంధం ఉన్న ‘ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (టీఆర్‌ఎఫ్‌)’ ఉన్నట్లు భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ దాడి సీమాంతర ఉగ్రవాదం యొక్క తీవ్రతను మరోసారి బయటపెట్టింది, దీంతో భారత ప్రభుత్వం దౌత్య, ఆర్థిక చర్యల ద్వారా పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది.సీమాంతర ఉగ్రవాదానికి ఆర్థిక మూలాలను లక్ష్యంగా చేసుకుని భారత్‌ రెండు కీలక ఫైనాన్షియల్‌ స్ట్రైక్స్‌కు ప్రణాళికలు రూపొందిస్తోంది. మొదటిది ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌  గ్రే లిస్ట్‌లో పాకిస్థాన్‌ను చేర్చేందుకు అంతర్జాతీయ ఒత్తిడి పెంచడం. రెండవది, అంతర్జాతీయ ద్రవ్య నిధి  నుంచి పాకిస్థాన్‌కు అందే 7 బిలియన్‌ డాలర్ల రుణ సహాయంపై ఆందోళనలు వ్యక్తం చేయడం. ఈ చర్యలు ఆర్థికంగా ఇప్పటికే సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌కు తీవ్ర దెబ్బ తీస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ అనేది 1989లో జీ–7 దేశాలు, ఐరోపా కమిషన్‌ల ఆధ్వర్యంలో పారిస్‌లో స్థాపించబడిన అంతర్జాతీయ సంస్థ. ఇది ఉగ్రవాద నిధులు, మనీ లాండరింగ్, ఇతర అక్రమ ఆర్థిక కార్యకలాపాలను నిరోధించేందుకు నిబంధనలు రూపొందిస్తుంది. ఊఅఖీఊ గ్రే లిస్ట్‌లో చేరిన దేశాలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు, విదేశీ పెట్టుబడులు పొందడంలో తీవ్ర ఆటంకాలు ఎదుర్కొంటాయి. పాకిస్థాన్‌ 2018–2022 మధ్య గ్రే లిస్ట్‌లో ఉండి, 2022లో బయటపడినప్పటికీ, పహల్గాం దాడి నేపథ్యంలో మళ్లీ ఈ జాబితాలోకి చేరే అవకాశం ఉంది.పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే దిగజారుడు స్థితిలో ఉంది. అధిక ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, రాజకీయ అస్థిరతలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. 2024 జులైలో ఐఎంఎఫ్‌తో ఒప్పందం ద్వారా పాకిస్థాన్‌కు 7 బిలియన్‌ డాలర్ల రుణ సహాయం లభించినప్పటికీ, ఈ నిధులు ఉగ్రవాద కార్యకలాపాలకు దుర్వినియోగమవుతున్నాయని భారత్‌ ఆరోపిస్తోంది. ఊఅఖీఊ గ్రే లిస్ట్‌లో చేరితే, ఐఎంఎఫ్‌ రుణాలు, విదేశీ పెట్టుబడులు మరింత కష్టతరమవుతాయి, ఇది పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థను మరింత బలహీనపరుస్తుంది.పహల్గాం దాడి అనంతరం భారత్‌ తీసుకున్న కీలక నిర్ణయాల్లో సింధూ జలాల ఒప్పందం  అమలు నిలిపివేత ఒకటి. 1960లో రూపొందిన ఈ ఒప్పందం సింధూ నదీ జలాలను భారత్, పాకిస్థాన్‌ మధ్య పంచుకునే విధానాన్ని నిర్దేశిస్తుంది. ఈ ఒప్పందం నిలిపివేతతో పాకిస్థాన్‌లో వ్యవసాయం, జలవిద్యుత్‌ ఉత్పత్తి తీవ్రంగా దెబ్బతింటాయి. అదనంగా, భారత్‌ పాకిస్థాన్‌ పౌరుల వీసాలను రద్దు చేయడం, అటారీ–వాఘా సరిహద్దును మూసివేయడం, పాకిస్థాన్‌ దౌత్యవేత్తలను వెనక్కి పంపడం వంటి చర్యలు తీసుకుంది.పహల్గాం దాడిని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించింది. అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్‌ ఈ దాడికి పాకిస్థాన్‌ బాధ్యత వహించాలని, ఉగ్రవాద నిర్మూలనలో భారత్‌కు సహకరించాలని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భారత్, పాకిస్థాన్‌లను సంయమనం పాటించాలని కోరింది, అయితే భారత్‌ ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్‌ విధానాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. చైనా మాత్రం పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచి, దాడిపై నిష్పక్షపాత విచారణ జరగాలని కోరింది.జాతీయ దర్యాప్తు సంస్థ  పహల్గాం దాడి కేసును స్వీకరించి, సమగ్ర విచారణ చేపట్టింది. దాడిలో పాకిస్థాన్‌కు చెందిన ముగ్గురు, ఒక స్థానిక ఉగ్రవాది పాల్గొన్నట్లు గుర్తించారు. లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న టీఆర్‌ఎఫ్‌ ఈ దాడికి బాధ్యత వహించినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. స్థానికంగా 10 మందికి పైగా కశ్మీరీలు ఉగ్రవాదులకు సహకరించినట్లు దర్యాప్తులో తేలింది. భద్రతా దళాలు ఉగ్రవాదుల ఇళ్లను ధ్వంసం చేయడం, విస్తృత గాలింపు చర్యలు చేపట్టడం వంటి కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.పహల్గాం ఉగ్రదాడి భారత్‌–పాకిస్థాన్‌ సంబంధాలను మరింత దిగజార్చడమే కాక, సీమాంతర ఉగ్రవాదంపై భారత్‌ దృష్టిని మరింత పదును చేసింది. ఆర్థిక, దౌత్య చర్యల ద్వారా పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచడం, అంతర్జాతీయ మద్దతును సమీకరించడం ద్వారా భారత్‌ ఉగ్రవాద నిర్మూలనలో దృఢమైన వైఖరిని కొనసాగిస్తోంది. ఈ చర్యలు పాకిస్థాన్‌ ఆర్థిక, రాజకీయ స్థితిగతులపై ఎలాంటి ప్రభావం చూపుతాయి, అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తుంది అనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.

Related Posts