YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

నష్టాల్లో ఇండియన్ మార్కెట్స్

నష్టాల్లో ఇండియన్ మార్కెట్స్
ఇండియన్ స్టాక్ మార్కెట్ బుధవారం భారీ నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ ఏకంగా 350 పాయింట్లకు పైగా పతనమైతే.. నిఫ్టీ 100 పాయింట్లకు పైగా క్షీణించింది. ఒకానొక సమయంలో 450 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ తర్వాత కొంత కోలుకుంది. చివరకు 363 పాయింట్ల నష్టంతో 35,891 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 117 పాయింట్ల నష్టంతో 10,792 వద్ద క్లోజయ్యింది. ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ నష్టపోవడం, అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు మన మార్కెట్లపై నెగటివ్ ప్రభావం చూపాయి. అలాగే డిసెంబర్ నెల ప్యాసింజర్ వాహన అమ్మకాలు అంతంత మాత్రంగానే నమోదుకావడం, రూపాయి క్షీణత, జీఎస్‌టీ వసూళ్లు తగ్గడం, దేశీ తయారీ రంగ గణాంకాలు ఆశాజనకంగా లేకపోవడం వంటి అంశాలు కూడా ప్రతికూల ప్రభావం చూపాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ నష్టపోయాయి. మరీముఖ్యంగా నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఆటో ఇండెక్స్‌లు ఏకంగా 3 శాతానికి పైగా పతనమయ్యాయి. వాహన అమ్మకాలు మందగొడిగా ఉండటం వల్ల వాహన రంగ స్టాక్స్ బాగా నష్టపోయాయి. ఐషర్ మోటార్స్ షేర బాగా పడిపోయింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ డిసెంబర్ నెల వాహన విక్రయాలు 13 శాతానికి పైగా తగ్గడం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. టీవీఎస్ మోటార్ 5 శాతానికి పైగా, ఎంఅండ్ఎం 4 శాతానికి పైగా, హీరో మోటొకార్ప్ 3 శాతానికి పైగా నష్టపోయాయి.మెటల్ షేర్లు కూడా బాగా పతనమయ్యాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 5 శాతానికి పైగా, టాటా స్టీల్ 5 శాతం మేర, వేదాంత 4 శాతానికి పైగా క్షీణించాయి. హిందాల్కో, సెయిల్ షేర్లు 3 శాతానికి పైగా పడిపోయాయి. నిఫ్టీ 50లో కేవలం 9 షేర్లు మాత్రమే స్వల్ప లాభాల్లో ఉన్నాయి. సన్ ఫార్మా 1 శాతానికి పైగా పెరిగింది. లాభపడిన స్టాక్స్‌లో టీసీఎస్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, టైటాన్, ఇన్ఫోసిస్, ఏసియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్, యూపీఎల్ ఉన్నాయి.

Related Posts