YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

భారీగా బలపడిన రూపాయి

భారీగా బలపడిన రూపాయి
ఇండియన్ రూపాయి సోమవారం బలపడింది. అమెరికా డాలర్తో పోలిస్తే లాభాల్లో ట్రేడవుతోంది. ఐదు నెలల గరిష్ట స్థాయిలో కదలాడుతోంది. అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభమవ్వడం, ఫెడరల్ రిజర్వు.. వడ్డీ రేట్ల పెంపునకు విరామం పలకవచ్చనే అంచనాలు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచాయి. అలాగే ట్రేడర్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన భారత్ జీడీపీ వృద్ధి గణాంకాల కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఈ గణాంకాలను విడుదల చేయనుంది. ఉదయం 9:10 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 69.39 వద్ద ట్రేడవుతోంది. రూపాయి తన మునపటి ముగింపు స్థాయి 69.73తో పోలిస్తే 0.54 శాతం పెరిగింది. రూపాయి సోమవారం 69.42 వద్ద ప్రారంభమైంది. తర్వాత ఒకానొక సమయంలో 69.36 స్థాయిని కూడా తాకింది. రూపాయి చివరిగా 2018 ఆగస్ట్ 10న ఈ స్థాయిని తాకింది. అమెరికా, చైనా దేశాల అధికారులు బీజింగ్‌లో సమావేశమయ్యారు. వాణిజ్య సంబంధిత అంశాలపై చర్చించనున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనపడితే వడ్డీ రేట్ల పెంపునకు విరామం ఉండొచ్చని ఫెడరల్ రిజర్వు సంకేతాలిచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజీనామా చేయమని ఒత్తిడి తీసుకువచ్చినా కూడా పదవిలో కొనసాగుతానని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ తెలిపారు. భారత్‌లో పదేళ్ల బాండ్ ఈల్డ్స్ 7.448 శాతం వద్ద ట్రేడవుతున్నాయి. ఈల్డ్స్ మునపటి ముగింపు స్థాయి 7.449 శాతంగా ఉంది. రూపాయి ఈ ఏడాది ఇప్పటి దాకా 0.86 శాతం మేర క్షీణించింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల నుంచి 145.2 మిలియన్ డాలర్లను, డెట్ మార్కెట్ల నుంచి 158 మిలియన్ డాలర్లను వెనక్కు తీసుకెళ్లారు. ఆసియా ప్రధాన కరెన్సీలన్నీ దాదాపు లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. ఇండోనేసియా రుపియా 1.3 శాతం, మలేసియా రింగిట్ 0.61 శాతం, దక్షిణ కొరియా ఒన్ 0.46 శాతం, జపాన్ యెన్ 0.36 శాతం, చైనా రెన్‌మిన్‌బి 0.36 శాతం, ఫిలిప్పిన్స్ పెసో 0.30 శాతం, చైనా ఆఫ్‌షోర్ 0.19 శాతం, తైవాన్ డాలర్ 0.16 శాతం, సింగపూర్ డాలర్ 0.13 శాతం పెరిగాయి. ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్ ఇండెక్స్ 0.18 శాతం క్షీణతతో 96.01 వద్ద ట్రేడవుతోంది. 

Related Posts