YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ఇండియన్ స్టాక్ మార్కెట్ మంగళవారం కూడా లాభాల్లోనే ముగిసింది. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లైన సెన్సెక్స్ 131 పాయింట్ల లాభంతో 35,980 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 10,802 వద్ద క్లోజయ్యింది. లాభాల్లో ప్రారంభమైన మార్కెట్ సూచీలు తర్వాత వెంటనే నష్టాల్లోకి వెళ్లిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూలముగా ఉండటం ఇందుకు కారణం. అయితే బ్యాంక్ షేర్లలో కొనుగోలు జోరు కారణంగా ఇండెక్స్‌లు మళ్లీ లాభాల బాట పట్టాయి. అమెరికా మార్కెట్ ఫ్యూచర్లు పాజిటివ్‌గా ఉండటం కూడా సానుకూల ప్రభావం చూపింది. సెన్సెక్స్ ఇంట్రాడేలో 35,753 పాయింట్ల కనిష్ట స్థాయిని, 36,037 గరిష్ట స్థాయిని తాకింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 10,733 పాయింట్ల కనిష్ట స్థాయిని, 10,818 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. నిఫ్టీ 50లో సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, టాటా మోటార్స్, యస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. సన్ ఫార్మా 4 శాతానికి పైగా పెరిగింది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ షేర్లు 3 శాతానికి పైగా లాభపడ్డాయి. అదే సమయంలో జీ ఎంటర్‌టైన్‌మెంట్ 3 శాతం మేర పడిపోయింది. యూపీఎల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఎన్‌టీపీసీ, గెయిల్, హిందాల్కో షేర్లు 1 శాతానికి పైగా నష్టపోయాయి. ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయిని తాకాయి. సెక్టోరల్ ఇండెక్స్‌లు మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మీడియా, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌లు నష్టపోయాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ గరిష్టంగా 2.5 శాతానికి పైగా ర్యాలీ చేసింది. దీని తర్వాత నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 1.5 శాతానికి పైగా పెరిగింది

Related Posts