YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో 130 ఏళ్ల పురాతన హనుమాన్ విగ్రహం తొలగింపు కలకలం!!

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో 130 ఏళ్ల పురాతన హనుమాన్ విగ్రహం తొలగింపు కలకలం!!

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో 130 ఏళ్ల పురాతన హనుమాన్ విగ్రహం తొలగింపు కలకలం రేపింది. మూడు రోజులుగా జరుగుతున్నఈ పనుల్లో మూడు జేసీబీ మిషన్లతో పాటు మరికొన్ని మిషన్లు కూడా పాడయ్యాయి. అయితే విగ్రహం ఇంచు కూడా కదలలేదు. దీంతో హిందూ వాహిని సంఘంతో పాటు స్థానికులు కూడా మందిరాన్ని ఇక్కడే ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ మందిరాన్ని తొలగిస్తే ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ మందిరం నేషనల్ హైవే- 24ను ఆనుకుని ఉంది. ఇక్కడ 130 సంవత్సరాల క్రితం హనుమంతుని విగ్రహాన్ని స్థాపించారు. ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఈ ఆలయాన్ని తొలగించాల్సి వచ్చింది. దీనిలో భాగంగా హనుమాన్ విగ్రహాన్ని తొలగించేందుకు ఆ కంపెనీ మూడు రోజులుగా తీవ్రంగా ప్రయత్నించింది. అయినా వారు విగ్రహాన్ని ఏమాత్రం కదిలించలేకపోయింది. ఈ పురాతన హనుమాన్ ఆలయాన్ని సందర్శించేందుకు స్థానికులతో పాటు చుట్టు పక్క ప్రాంతాలనుంచి  భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు.

Related Posts