YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

త్వరలో అంతరించబోతున్న పాత తరం తస్మాత్ జాగ్రత్త ..!!

త్వరలో అంతరించబోతున్న పాత తరం తస్మాత్ జాగ్రత్త ..!!

రాబోయే 10/15 సంవత్సరాలలో ఒక క్రమశిక్షణ కలిగిన, కష్టపడిన తరం ఈ ప్రపంచం  నుండి కనుమరుగు అవ్వబోతోంది.
.
అవును ఇది ఒక చేదు నిజం ।
.
ఆ తరం ప్రజలు అతి సామాన్య వ్యక్తులు.

వాళ్ళు.....
.
రాత్రి పెందరాళే పడుకునే వాళ్ళు !
ఉదయం పెందరాళే లేచేవాళ్ళు !
నడక అలవాటు ఉన్నవాళ్ళు!
మార్కెట్ కి నడిచి వెళ్ళే వాళ్ళు !
.

వాళ్ళు.....
.

.
ఉదయమే  వాకిట కళ్ళాపు చల్లేవాళ్ళు !
ముంగిట్లో ముగ్గులు పెట్టేవాళ్ళు!
మొక్కలకు నీళ్ళు పెట్టేవాళ్ళు!
పూజకు పూలు కోసే వాళ్ళు !
.
.వాళ్ళు....
.

పూజ కాకుండా ఏమీ తినని వాళ్ళు !
మడిగా వంట వండేవాళ్ళు !
దేవుడి గదిలో దీపం వెలిగించే వాళ్ళు!
దేవుడి గుడికి వెళ్ళే వాళ్ళు !
దేముడి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు !!!
మనిషిని మనిషిగా ప్రేమించే వాళ్ళు.!!!

.

వాళ్ళు
.

అందరితో ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు!
కుశల ప్రశ్నలు వేసేవాళ్ళు !
స్నేహంగా మెలిగే వాళ్ళు!
తోచిన సాయం చేసేవాళ్ళు !
చేతులు జోడించి నమస్కారం చేసేవాళ్ళు !

.

వాళ్ళు
.
ఉత్తరం కోసం ఎదురుచూసిన వాళ్ళు !
ఉత్తరాల తీగకు గుచ్చిన వాళ్ళు !
పాత ఫోన్ లు పట్టుకు తిరిగే వాళ్ళు!
ఫోన్ నెంబర్ లు డైరీ లో రాసిపెట్టుకునే వాళ్ళు!

.
వాళ్ళు

.

పండుగలకూ, పబ్బాలకూ అందరినీ పిలిచే వాళ్ళు!
కుంకుడు కాయతో తలంటుకున్నవాళ్ళు !
సున్నిపిండి నలుగు పెట్టుకున్నవాళ్ళు !
పిల్లలకు పాలిచ్చి పెంచినవాళ్ళు !
.

.
వాళ్ళు ....
.
.
తీర్థయాత్రలు చేసేవాళ్ళు !
ఆచారాలు పాటించే వాళ్ళు !
తిధి, వారం , నక్షత్రం గుర్తుపెట్టుకునే వాళ్ళు !
పుట్టిన రోజు దీపం వెలిగించి జరుపుకునేవాళ్ళు !
.
.
వాళ్ళు ....
.
.
చిరిగిన బనియన్లు తొడుక్కుని ఉండేవాళ్ళు !
లుంగీలు, చీరలు  కట్టుకుని ఉండేవాళ్ళు !
చిరిగిన  చెప్పులు కుట్టించుకుని వాడుకునే వాళ్ళు!
అతుకుల చొక్కాలు కట్టుకున్నవాళ్ళు !
.
.
వాళ్ళు ....
.
.
తలకు నూనె రాసుకునే వాళ్ళు !
జడగంటలు పెట్టుకున్నవాళ్ళు !
కాళ్ళకు పసుపు రాసుకునేవాళ్ళు !
చేతికి గాజులు వేసుకునే వాళ్ళు !

ఇప్పటిలా మనుష్యులను వాడుకుని వస్తువుల తో స్నేహం కాకుండా... వస్తువులను వాడుకుంటూ మనుషుల తో స్నేహంగా గడిపిన తరం.....
.
ఈ తరాన్ని చూసి మూగబోయిన వాళ్ళు
.

మీకు తెలుసా ?

.
వీళ్ళంతా నెమ్మది నెమ్మదిగా  మనల్ని వదిలి పెట్టి వెళ్ళిపోతున్నారు.

.
మన ఇళ్ళల్లో ఇలాంటి వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమె ఉన్నారు.
.

మీ ఇంటిలో ఇలాంటి వాళ్ళు ఉంటె దయచేసి వాళ్ళను బాగా చూసుకోండి
.

.
.లేదంటే .....
.
.లేదంటే .....
.
.లేదంటే .....
.
ఇప్పటి తరం చాలా కోల్పోవలసి వస్తుంది.
.
.
.వాళ్ళ ప్రపంచం, వస్తువులతో కాకుండా, మనుషులతో మానవత్వం తో,స్నేహం తో కూడి ఉండే తరం...
.
.

.
సంతోషకరమైన జీవనం గడిపిన తరం అది ,!
.

స్పూర్తిదాయక జీవనం గడిపిన తరం అది !
.

కల్లాకపటం లేని జీవనం గడిపిన తరం అది!
.
ఉన్నది ఉన్నట్టు నిర్మొహమాటంగా ధైర్యంగా మాట్లాడగలిగిన తరం
.

ద్వేషం, మోసం లేని స్నేహ  జీవనం గడిపిన తరం అది!
.

సాత్విక ఆహారం తిని జీవనం గడిపిన తరం అది!
.

లోకానికి తప్పు చేయడానికి భయపడి జీవనం గడిపిన తరం అది !
.

ఇరుగుపోరుగుతో కలసిమెలసి జీవనం గడిపిన తరం అది!
.
తనకోసం కొంత మాత్రమే వాడుకుని, తన సంతానం వృధ్ధి కోసం పరితపించిన తరం
.
.
వారినుండి మనం నేర్చుకోకపోతే ముందు తరాల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది
.
.
.
.
మీ కుటుంబం లో పెద్దవారిని మీరు గౌరవించడం ద్వారా మీ పిల్లకు మంచి సంస్కారం అందివ్వండి. .????
.
.
సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజాలతో స్నేహంగా వుండేట్టు వారిని తయారు చేయాలి...
.
.
సంస్కారం లేని దేశం ... సంస్కృతి లేని దేశం గా ఈ భారతాన్ని  మార్చేయ్యకండి !!!

తప్పులను సరిదిద్దగలది  సంస్కారమే!????
.
.

సర్కారు చేసే  చట్టాలు కాదు..

రాబోయే తరాలకు ఆస్తులనే కాదు ... ఆప్యాయతలను,స్నేహాన్ని కూడా అందిద్దాం.. లేకుంటే రాబోయే తరాలవారిని మనుషులుగా కాక మర యంత్రాలుగా పిలుస్తారు..

అప్పుడు మనిషి అన్నవాడే అంతరించి పోయిఉంటాడు.....

తస్మాత్ జాగ్రత్త.

Related Posts