YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

'ది మోడరన్ వాల్' పుజారా..!!

 'ది మోడరన్ వాల్' పుజారా..!!

పుజారా.. ప్రస్తుత టీం ఇండియా టెస్ట్ జట్టును ఒంటి చేతితో మోస్తున్న టిపికల్ మరియు టెక్నికల్ బ్యాట్స్ మెన్. 72 సంవత్సరాల భారత టెస్ట్ క్రికెట్ చరిత్ర లో అందని ద్రాక్షగా ఉండిపోయిన ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ గెలుపుని...  మన జట్టుకి అందించాడు ఈ సౌరాష్ట్ర కుర్రాడు. సచిన్, సెహ్వాగ్, గంగూలీ, లక్ష్మణ్ వంటి దిగ్గజాలు ఉండగా కూడా సాధించని విజయాన్ని పుజారా తన నిలకడైన బ్యాటింగ్ తో ఆ విజయాన్ని నల్లేరుపై నడక చేసాడు. సిరీస్‌లో జరిగిన 4 టెస్టుల్లో ఏకంగా మూడు శతకాలు సాధించిన పుజారా.. ఏడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మొత్తం 521 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కంగారూలు అందరూ కెప్టెన్ కోహ్లీ మీద తమ అస్త్రాలు ప్రయోగిస్తే.. పుజారా మాత్రం తన అస్త్రాలను కంగారూలు మీదకి వదిలాడు.
  సౌరాష్ట్ర తరపున రంజిలు ఆడిన ఈ 31 ఏళ్ళ కుర్రాడు 2010 లో తన తొలి టెస్ట్ మ్యాచ్ బెంగళూరు లో ఆస్ట్రేలియా తో ఆడాడు. పుజారా తన తొలి సెంచరీ 2012 లో న్యూజీలాండ్ తో చేసాడు. ఎన్నో మ్యాచ్లలో అద్భుత ఇన్నింగ్స్ ఆడి తన టీం కు ఎన్నో విజయాలు అదించాడు.  'ది వాల్' రాహుల్  ద్రావిడ్ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తరువాత ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అని ప్రతి భారతీయుడు ఎదురుచూస్తున్న సమయంలో పుజారా వచ్చి ఆ స్థానం లో ఆడి ఆ స్థానానికి తనే సరైనోడు అని ప్రతి భారతీయుడి నోట అనిపించుకున్నాడు. పుజారాకు ధోని, కోహ్లీ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ కి లేకపోయినా.. ప్రతి క్రికెట్ ప్రేమికుడు చేత 'సేవియార్ అఫ్ ఇండియా', 'ది మోడరన్ వాల్' అని అనిపించుకున్నాడు.

Related Posts