
హైదరాబాద్
పి సి సి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 83 సంవత్సరాల నుండి 84 సంవత్సరాల కి అడుగుపెడుతున్న సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు వి. హనుమంతరావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంబర్పేట్ లోని తన నివాసంలో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేశారు. పార్లమెంటులో మోడీ చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్, బిజెపి లకు వ్యతిరేకంగా పనిచేస్తున్న తమ నాయకుడు ఖర్గే అని అన్నారు. తెలంగాణలో కులగనన జరుగుతున్నట్టే అన్ని రాష్ట్రాల్లో జరగాలని రాహుల్ గాంధీ కోరుకుంటున్నారు. బడుగు బలహీన వర్గాల కోసం రాహుల్ గాంధీ ఆలోచిస్తున్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారనీ గుర్తు చేశారు.