
సిద్దిపేట
ఒకప్పుడు తెలంగాణలో ఎకరా భూమి అమ్మితే ఏపీలో పదేకరాల భూమి వచ్చేది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ చంద్రబాబు వచ్చాక సీన్ రివర్స్ అయింది. ఏపీలో ఎకరా అమ్మితే తెలంగాణలో రెండెకరాల భూమి వస్తుంది. రేవంత్ కి పాలన చేతకాక తెలంగాణలో ఇలాంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని హరీష్ రావు అన్నారు.
కాంగ్రెస్ 20 నెలల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది. కాంగ్రెస్ పాలనలో ప్రజలు స్వీయ అనుభవం చెందారు. రేవంత్ రెడ్డి చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వలేదు కానీ 2 లక్షల పెన్షన్లు తీసేశారని అనంనారు.
కాంగ్రెస్ పాలనలో ఎరువుల కోసం చెప్పులు క్యూలైన్ లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కేసీఆర్ హయాంలో నాట్లకు నాట్లకు రైతు బంధు వచ్చేది. రేవంత్ రెడ్డి హయాంలో ఓట్లకు ఓట్లకు మధ్య రైతు భరోసా వస్తుంది. కాంగ్రెస్ వచ్చాక బోరుబావుల మోటర్ల మెకానిక్ లు మాత్రమే బాగుపడ్డారని అన్నారు.
ఒకప్పుడు తెలంగాణలో ఎకరా భూమి అమ్మితే ఏపీలో పదేకరాల భూమి వచ్చేది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ చంద్రబాబు వచ్చాక సీన్ రివర్స్ అయింది. ఏపీలో ఎకరా అమ్మితే తెలంగాణలో రెండెకరాల భూమి వస్తుంది. రేవంత్ కి పాలన చేతకాక తెలంగాణలో ఇలాంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.
గజ్వేల్ లో కాంగ్రెస్ నేతలు వసూళ్లకు పాల్పడుతున్నారు. గజ్వేల్ లో అన్ని మండలాల్లో గులాబీ జెండా ఎగరాలి. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గజ్వేల్. స్థానిక సంస్థల ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు. సిద్దిపేట జిల్లాపై కాంగ్రెస్ పార్టీ పగపట్టింది. నాయకులు ఎవరు గ్రూపుల జోలికిపోవొద్దు. రిజర్వేషన్లు వచ్చినప్పుడు ఎవరు పోటీలో ఉంటారనేది చర్చించి నిర్ణయం తీసుకుందామని అన్నారు.