YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

రెండో రోజు నష్టాల్లోనే మార్కెట్లు

రెండో రోజు నష్టాల్లోనే మార్కెట్లు

దేశీ స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు నష్టాల్లోనే ముగిసింది. లాభాల్లో ప్రారంభమైన బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు తర్వాత ఆ లాభాలను నిలుపుకోలేకపోయాయి. చివరకు సెన్సెక్స్ 97 పాయింట్ల నష్టంతో 36,009 వద్ద, నిఫ్టీ 26 పాయింట్ల నష్టంతో 10,794 వద్ద క్లోజయ్యాయి. నిఫ్టీ 10,800 స్థాయిని రక్షించుకోలేకపోయింది. సెన్సెక్స్ మాత్రం 36,000 స్థాయిని కాపాడుకుంది. సెన్సెక్స్ ఒకానొక సమయంలో 36,000 స్థాయి కిందకు పడిపోయింది. అయితే చివరకు నష్టాలను తగ్గించుకుంది. ఆసియా మార్కెట్ల లాభాల కారణంగా ఉదయం మన మార్కెట్ లాభాల్లోనే ప్రారంభమైంది. అయితే తర్వాత ఐటీ, ఆటో, బ్యాంక్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఇండెక్స్‌లు నష్టాల్లోకి జారుకున్నాయి. నిఫ్టీ 50లో ఐటీసీ, యూపీఎల్, విప్రో, ఐఓసీ, హిందాల్కో, ఓఎన్‌జీసీ, ఏసియన్ పెయింట్స్, ఇన్ఫోసిన్, వేదాంత, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, టీసీఎస్, యస్ బ్యాంక్, గెయిల్, ఎల్‌అండ్‌టీ, టాటా స్టీల్, ఎస్‌బీఐ షేర్లు పడిపోయాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు 3 శాతానికి పైగా నష్టపోయాయి. భారతీ ఇన్‌ఫ్రాటెల్, టీసీఎస్ షేర్లు 2 శాతానికి పైగా పడిపోయాయి. ఐటీసీ, యూపీఎల్, విప్రో షేర్లు 1 శాతానికి పైగా లాభపడ్డాయి. ఇంట్రాడేలో నిఫ్టీ 10,739 పాయింట్ల కనిష్ట స్థాయిని, 10,850 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఇక సెన్సెక్స్ 35,840- 36,214 పాయింట్ల శ్రేణిలో కదలాడింది. 

Related Posts