YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణ శాసనసభాపతి అభ్యర్థిగా పోచారం

తెలంగాణ శాసనసభాపతి అభ్యర్థిగా పోచారం

తెలంగాణ శాసనసభాపతి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. శాసనసభాపతి అభ్యర్థిగా బాన్సువాడ శాసనసభ్యుడు, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి(69) గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. పోచారం తరఫున ఆరు ప్రతిపాదనలు సమర్పించారు. ఇవాళ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ సభాపతి అభ్యర్థి కోసం ప్రతిపాదనలు స్వీకరిస్తారు. పోచారం పేరును ప్రతిపాదించిన వారిలో సీఎం కేసీఆర్‌తోపాటు మల్లు భట్టి విక్రమార్క, అహ్మద్‌ బలాల, సురేఖా నాయక్‌, అబ్రహం ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మేరకు బుధవారం రాత్రి కేసీఆర్‌.. పోచారంతో మాట్లాడారు. గురువారం ఉదయమే పోచారం పేరు ప్రకటించి, ఆయనతో నామినేషన్‌ దాఖలు చేయించారు. సభాపతి ఎన్నికకు సంబంధించి సీఎం కేసీఆర్‌ గత నెల రోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఈ పదవికి అర్హులుగా భావించి ఒక జాబితాను రూపొందించారు. పలువురు నేతలతో మాట్లాడారు. చివరికి ఆయన పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేరు ఖరారు చేశారు. అనుభవం, వాక్పటిమ కారణంగా పోచారం సభను సమర్థంగా నిర్వహించగలరని సీఎం భావిస్తున్నట్లు తెలిసింది. ఇంజినీరింగ్‌ పట్టభద్రుడైన పోచారం శాసనసభకు ఆరోసారి ఎంపికయ్యారు. వ్యవసాయ మంత్రిగానూ బాగా పనిచేశారని సీఎం భావిస్తున్నారు. ఇప్పటికే ఆయనను ఒప్పించేందుకు పలు దఫాలు చర్చలు జరిపారు. వయస్సు, ఆరోగ్యపరమైన సమస్యలను ఆయన సీఎం దృష్టికి తెచ్చినా.. వాటిపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని సీఎం భరోసా ఇచ్చినట్లు తెలిసింది. పోచారం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి ఉంటే ప్రత్యామ్నాయంగా ఆయన కుమారుడికి అవకాశం ఇచ్చేందుకు కూడా సీఎం నుంచి హామీ ఇచ్చినట్లు సమాచారం.కాగా బుధవారం రాత్రి కేసీఆర్‌.. పోచారంతో మాట్లాడారు. గురువారం ఉదయమే పోచారం పేరు ప్రకటించి, ఆయనతో నామినేషన్‌ దాఖలు చేయించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిసింది. ఒకవేళ ఆయన కానిపక్షంలో పద్మాదేవేందర్‌రెడ్డి (మెదక్‌), ఇంద్రకరణ్‌రెడ్డి (నిర్మల్‌) లేదా అనూహ్యంగా ఇతర ముఖ్యనేతల్లో ఒకరు ఖరారు అవుతారని అందరు భావించారు.సభాపతి ఎన్నికకు సంబంధించి సీఎం కేసీఆర్‌ గత నెల రోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఈ పదవికి అర్హులుగా భావించి ఒక జాబితాను రూపొందించారు. పలువురు నేతలతో మాట్లాడారు. చివరికి ఆయన పోచారం శ్రీనివాస్‌రెడ్డి వైపు మొగ్గుచూపారు.అనుభవం, వాక్పటిమ కారణంగా పోచారం సభను సమర్థంగా నిర్వహించగలరని సీఎం భావిస్తున్నట్లు తెలిసింది. ఇంజినీరింగ్‌ పట్టభద్రుడైన పోచారం శాసనసభకు ఆరో సారి ఎంపికయ్యారు. వ్యవసాయ మంత్రిగానూ బాగా పనిచేశారని సీఎం భావిస్తున్నారు. ఇప్పటికే ఆయనను ఒప్పించేందుకు పలు దఫాలు చర్చలు జరిపారు. వయస్సు, ఆరోగ్యపరమైన సమస్యలను ఆయన సీఎం దృష్టికి తెచ్చినా.. వాటిపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని సీఎం భరోసా ఇచ్చినట్లు తెలిసింది. పోచారం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి ఉంటే ప్రత్యామ్నాయంగా ఆయన కుమారుడికి అవకాశం ఇచ్చేందుకు కూడా సీఎం నుంచి హామీ లభించినట్లు సమాచారం. మరోవైపు ప్రత్యామ్నాయంగా సిద్ధంగా ఉండాలని పద్మాదేవేందర్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిలకూ సీఎం చెప్పినట్లు

సమాచారం.శాసనసభాపతి పదవిని ఏకగ్రీవం చేసేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు. టీసీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మజ్లిస్‌ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌లతో బుధవారం సాయంత్రం ఆయన ఫోన్లో మాట్లాడారు. సభాపతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించాలని ప్రతిపాదించారు. సీఎం ప్రతిపాదనకు మజ్లిస్‌, భాజపా అధ్యక్షులు వెంటనే అంగీకారం తెలిపారు. పార్టీలో చర్చించిన తర్వాత తము పోటి చేయడం లేదని  గురువారం ఉదయం టీపీసీసీ అధ్యక్షుడు వెల్లడించారు. దీనితో పోచారం ఎన్నిక ఏకగ్రీవమైంది.

Related Posts