YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌

 ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరిగాయి. ఇప్పుడు అందరి దృష్టి బడ్జెట్ సమావేశాలపై పడింది. జనవరి 31 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని పార్లమెంట్ వ్యవహారాలకు సంబంధించిన కేబినెట్ కమిటీ నిర్ణయించింది. ఫిబ్రవరి 13 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. 2019 ఎన్నికలకు చివరి బడ్జెట్ సమావేశాలు కావడంతో కేంద్రం అన్ని వర్గాలకు వరాలు ప్రకటించొచ్చనే అంచనాలున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులు, మధ్య తరగతి కుటుంబాలపైన కేంద్రం దృష్టి కేంద్రీకరించే అవకాశముంది. సాధారణంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలి. అయితే ఈయన కేన్సర్‌తో బాధపడుతున్నారు. దీంతో రెండు వారాల పాటు వ్యక్తిగత సెలవు తీసుకుంటున్నట్లు ప్రకటించిన చికిత్స నిమిత్తం న్యూయార్క్ బయలుదేరి వెళ్లారు. ఈ నేపథ్యంలో జైట్లీ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడతారా? లేదా? అనే అంశంపై సందేహాలున్నాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించనున్నారు. 16వ లోక్ సభకు ఇవే చివరి సమావేశాలు కానున్నవి. అయితే 2014లో మోదీ సర్కార్ అధికారంలోకి రాగానే ఈ సాంప్రదాయాన్ని వదిలేసి, ఇంకాస్త ముందే బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం ప్రారంభించింది.సాధారణంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలి. అయితే ఈయన కేన్సర్‌తో బాధపడుతున్నారు. దీంతో రెండు వారాల పాటు వ్యక్తిగత సెలవు తీసుకుంటున్నట్లు ప్రకటించిన చికిత్స నిమిత్తం న్యూయార్క్ బయలుదేరి వెళ్లారు. ఈ నేపథ్యంలో జైట్లీ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడతారా? లేదా? అనే అంశంపై సందేహాలున్నాయి. సాధారణంగా బడ్జెట్‌ను ఫిబ్రవరి చివరి రోజున ప్రవేశపెడతారు. ఇది బ్రిటీషు కాలం నుంచి వస్తున్న ఆనవాయితీ. అయితే 2014లో మోదీ సర్కార్ అధికారంలోకి రాగానే ఈ సాంప్రదాయాన్ని వదిలేసి, ఇంకాస్త ముందే బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం ప్రారంభించింది.

Related Posts