YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

72 ఏళ్ల తర్వాత భారత్ చరిత్ర

72 ఏళ్ల తర్వాత భారత్ చరిత్ర

ఆస్ట్రేలియా గడ్డపై మరో చరిత్ర సృష్టించింది కోహ్లి సేన. మొన్నటికి మొన్న 72 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టెస్ట్ సిరీస్ గెలిచిన టీమిండియా.. తాజాగా తొలిసారి ఆసీస్ గడ్డపై ద్వైపాక్షిక వన్డే సిరీస్ గెలిచింది.  వన్డే సిరీస్‌‌లోనూ ఘన విజయం సాధించింది. మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో ఈరోజు జరిగిన ఆఖరి వన్డేలో మహేంద్రసింగ్ ధోని (87 నాటౌట్: 114 బంతుల్లో 6x4), కేదార్ జాదవ్ (61 నాటౌట్: 57 బంతుల్లో 7x4) అజేయ అర్ధశతకాలు బాదడంతో భారత్ జట్టు 7 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. దీంతో.. మూడు వన్డేల సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకున్న కోహ్లీసేన సగర్వంగా కంగారూల గడ్డపై పర్యటనని ముగించింది. ఈ సిరీస్‌కి ముందు జరిగిన మూడు టీ20ల సిరీస్‌ 1-1తో సమమవగా.. నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. అంతకముందు ఆస్ట్రేలియాలో తొలిసారి వన్డే ఆడిన భారత మణికట్టు స్పిన్నర్ చాహల్ అసాధారణ రీతిలో చెలరేగిపోయాడు. చాహల్ (6/42) దెబ్బకి టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 230 పరుగులకే కుప్పకూలిపోయింది. ఆ జట్టులో పీటర్ హ్యాండ్స్‌కబ్ (58: 63 బంతుల్లో 2x4) మాత్రమే అర్ధశతకంతో ఫర్వాలేదనిపించాడు. బెస్ట్ వన్డే ఫినిషర్ ఎమ్మెస్ ధోనీ మరోసారి మెరిసిన వేళ.. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో 7 వికెట్ల తేడాతో కోహ్లి సేన విజయం సాధించింది. 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. మరో 4 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 87 పరుగులతో ధోనీ నాటౌట్‌గా నిలిచాడు. అతనికి కేదార్ జాదవ్ చక్కని సహకారం అందించాడు. జాదవ్ 61 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లి 46, ధావన్ 23 పరుగులు చేశారు.

Related Posts