YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

మళ్లీ పెరుగుతున్న పెట్రోల్

 మళ్లీ పెరుగుతున్న పెట్రోల్

దేశీయంగా తగ్గినట్టే తగ్గి వినియోగదారులను మురిపించిన ఇంధన ధరలు క్రమంగా పైపైకి ఎగబాకుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల  ప్రభావంతో  జనవరి నుంచి  మొదలుపెట్టి వరుసగా శుక్రవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.  దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 8 పైసలు, డీజిల్ ధర 19 పెరిగింది. దీంతో  ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.70.55కి.. డీజిల్ ధర రూ.64.97కి పెరిగింది.ముంబై : పెట్రోలు ధర రూ.76.18, డీజిల్ రూ.68.02

చెన్నై: పెట్రోల్‌ రూ.73.23  డీజిల్‌ రూ.68.62

కోలకతా: పెట్రోల్‌ రూ.72.65,  డీజిల్‌ రూ.66.74

హైద‌రాబాద్‌: పెట్రోల్ ధర రూ.74.84, డీజిల్ ధరరూ.70.63  

విజయవాడ : పెట్రోల్‌ రూ.74.64 డీజిల్‌ రూ.70.05 

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 61.67 డాలర్ల వద్ద.. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 52.87 డాలర్ల వద్ద ఉంది. ఈ నెలలో పెట్రోల్ ధర 9సార్లు, డీజిల్ ధర 10సార్లు పెరిగింది. దీంతో పైసా పైసా పెరుగతూ వస్తున్న ధరలు మళ్లీ పాత స్థితికి  చేరుకుంటూ వుండటంతో వినియోగదారుల గుండెల్లో గుబులు మొదలైంది.

Related Posts