YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ఆసీస్ ను చావు దెబ్బ తీసిన చాహల్

ఆసీస్ ను చావు దెబ్బ తీసిన  చాహల్

మెల్‌బోర్న్ వన్డేలో స్పిన్నర్ యజువేంద్ర చాహల్ మెరిశాడు. ఆరు వికెట్లతో ఆసీస్ బ్యాటింగ్ విభాగాన్ని దెబ్బతీశాడు. చాహల్ దెబ్బకు మూడో వన్డేలో ఆస్ట్రేలియా 230 పరుగులకే పరిమితమైంది. తొలి రెండు వన్డేల్లో జట్టులో చోటు దక్కని చాహల్.. సిరీస్ నిర్ణయాత్మక వన్డేలో బరిలో దిగి సత్తా చాటాడు. 24వ ఓవర్లో బంతిని అందుకున్న అతడు.. షాన్ మార్ష్, ఉస్మాన్ ఖవాజా సహా ఆరుగురు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్ చేర్చాడు. పది ఓవర్లలో 42 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీసిన చాహల్ ఖాతాలో అనేక రికార్డులు చేరాయి. అవేంటో చూద్దాం..  ఆస్ట్రేలియా గడ్డ మీద వన్డే మ్యాచ్‌లో ఆరు వికెట్లు పడగొట్టిన తొలి స్పిన్నర్ చాహల్. ఆసీస్‌లో చాహల్ కంటే ముందు 8 మంది స్పిన్నర్లు 5 వికెట్ల హాల్‌లో చేరారు. కానీ వీరెవరూ ఆరు వికెట్లు తీయలేదు.  భారత్ వెలుపల రెండుసార్లు 5 వికెట్ల హాల్ సాధించిన తొలి భారత స్పిన్నర్ చాహల్. గత ఏడాది దక్షిణాఫ్రికాపై చాహల్ 22 పరుగులకే 5 వికెట్లు తీశాడు. నెహ్రా, ఇర్ఫాన్ పఠాన్ తర్వాత.. ఆసియా వెలుపల రెండుసార్లు ఐదేసి వికెట్లు తీసిన మూడో భారత బౌలర్ చాహల్. వన్డేలు, టీ20ల్లో కలిపి ఒకటి కంటే ఎక్కువసార్లు 6 వికెట్ల హాల్‌లో చేరిన రెండో బౌలర్ చాహల్. శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ అజింత మెండిస్ మాత్రమే వన్డే, టీ20ల్లో ఆరేసి చొప్పున వికెట్లు పడగొట్టాడు.  ఆస్ట్రేలియాపై వన్డే క్రికెట్లో ఆరు వికెట్ల హాల్ సాధించిన మూడో స్పిన్నర్ చాహల్. 2007లో మురళీ కార్తీక్ ముంబై వన్డేలో 27 పరుగులకే 6 వికెట్లు తీశాడు. 2009లో దుబాయ్ వన్డేలో షాహిద్ ఆఫ్రిదీ 38 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియాలో ఐదు వికెట్ల హాల్ సాధించిన మూడో భారత బౌలర్ చాహల్. రవిశాస్త్రి 1991లో పెర్త్ వన్డేలో 15 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. అజిత్ అగార్కర్ 2004 నాటి మెల్‌బోర్న్ వన్డేలో 42 రన్స్ ఇచ్చి 6 వికెట్లు తీశాడు.  కంగారూల గడ్డ మీద వన్డేల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 6/42. అగార్కర్‌తో చాహల్ సంయుక్తంగా టాప్‌‌లోకి చేరాడు. అగార్కర్, మిచెల్ స్టార్క్ (భారత్‌పై 6/43, 2015) క్రిస్ వోక్స్ (ఆస్ట్రేలియాపై 6/45, 2011) మాత్రమే ఇప్పటి వరకూ ఆస్ట్రేలియాలో ఆరు వికెట్ల హాల్ సాధించారు. వన్డేల్లో ఆరు వికెట్ల హాల్ సాధించిన 9వ భారత బౌలర్ చాహల్. గత ఏడాది నాటింగ్‌హమ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డేలో కుల్దీప్ యాదవ్ 25 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ గడ్డ మీద వన్డేల్లో ఆరు వికెట్లు తీసిన తొలి స్పిన్నర్ కుల్దీప్ మాత్రమే. 

Related Posts