YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ముహూర్తం ఖరారు... చంద్రబాబు దావోస్ నుంచి రాగానే వంగవీటి రాధ చేరి

ముహూర్తం ఖరారు... చంద్రబాబు దావోస్ నుంచి రాగానే వంగవీటి రాధ చేరి

రాధ చేరిక సందర్భంగా బహిరంగ సభ

మరింత మంది నేతలు టీడీపీలోకి

వెల్లడించిన ఏపీ టీడీపీ సీనీయర్ నేత

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వంగవీటి రాధ, తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైపోయిందని తెలుగుదేశం పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దావోస్ పర్యటనకు వెళ్లనుండగా, ఆయన అక్కడి నుంచి రాగానే రాధ చేరిక ఉంటుందని, ఈ సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీ టీడీపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఇంకా విషయం అధికారికంగా వెల్లడి కానందున, తన పేరును తెలిపేందుకు ఇష్టపడని ఆయన, వైకాపా నుంచి మరింత మంది నేతలు టీడీపీలోకి రానున్నారని, జగన్ వైఖరితో వారంతా విసిగిపోయి ఉన్నారని అన్నారు. రాధ చేరికతో కాపు సామాజికవర్గంలో, ముఖ్యంగా విజయవాడలో టీడీపీ మరింతగా బలపడుతుందని, ఆయనతో పాటు చాలా మంది స్థానిక నేతలు పార్టీ మారనున్నారని తెలిపారు.

రాధను బుజ్జగించేందుకు వైసీపీ నేతల ప్రయత్నాలు...

వైసీపీని వీడేందుకు నిర్ణయించుకున్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధకృష్ణ(రాధ)ను బుజ్జగించేందుకు వైసీపీ అగ్రనాయకత్వం రంగంలోకి దిగింది. ఈనెల 22నగాని, లేకపోతే 23వతేదీన గాని రాధ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో అధికార తెలుగుదేశం పార్టీలో చేరనున్నాయి. ఈ వార్తలు ఒక్కసారిగా గుప్పుమనేసరికి వైసీపీ అధినాయతక్వం అప్రమత్తమైంది. రాధతో మంతనాలు జరిపేందుకు కొందరు ముఖ్య నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఇదే విషయాన్ని కొందరు ముఖ్యనేతలకు సూచించారని తెలుస్తోంది. విజయవాడకు చెందిన పూనూరు గౌతమ్ రెడ్డితో తనకు విభేదాలు వచ్చినప్పుడు పార్టీ సరైన మద్దతు ఇవ్వలేదనే భావాన్ని రాధాలో ఉందని తెలుస్తోంది. దీంతో గత కొద్దిరోజులుగా ఆయన పార్టీతో అంటీముట్టనట్లుగా ఉంటున్నారని తెలుస్తోంది. కాగా... రాధాకృష్ణ వైసీపీని వీడితే విజయవాడలో పార్టీకి కొంత ఇబ్బందికరమేనని తెలుస్తోంది. దీంతో వైసీపీ ముఖ్యనేతలు రాధను బుజ్జగించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం.

Related Posts