YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

విద్యుత్ మిగులు రాష్రం గా తెలంగాణ

 విద్యుత్ మిగులు రాష్రం గా తెలంగాణ
రాబోయే కాలంలో లక్షా 17 వేల కోట్ల రూపాయిల విలువైన పనులను చేపడతామని గవర్నర్ నరసింహన్ చెప్పారు. శనివారం ఉదయం తెలంగాణ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. గత నాలుగున్నరేళ్లలో నీటి పారుదలకు 77 వేల 777 కోట్లు ఖర్చు చేశామని ఆయన చెప్పారు. చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన కాకతీయ మిషన్ సత్ఫలితాలనిచ్చిందని ఆయన అన్నారు. ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం సాధించుకోగలిగారు. రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ముందుండి నడిపించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  నాయకత్వంలో తొలిప్రభుత్వం ఏర్పడింది.  సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసాన్ని, ఇతర నష్టాలను పరిగణనలోకి తీసుకుని, ఆనాటి పరిస్థితుల్లో అవలంభించవలసిన పంథాను నిర్దేశించుకుని ప్రభుత్వం తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అన్ని రంగాల్లో పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించింది.పేదల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చింది. జటిలంగా మారిన విద్యుత్తు సంక్షోభం పరిష్కరించే చర్యలు చేపట్టింది. భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో మరే రాష్ట్రానికి సాధ్యం కాని స్థాయిలో ఆర్థిక వృద్ధిని తెలంగాణ రాష్ట్రం సాధించింది. 2014 నుంచి 2018 వరకు నాలుగు సంవత్సరాల కాలంలో 17.17 శాతం సగటు వార్షిక ఆదాయ వృద్ధిరేటు నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నెల నాటికి 29.93 శాతం ఆదాయాభివృద్ధి రేటు సాధించిందని సగర్వంగా సభకు తెలియచేస్తున్నాను.జి.ఎస్.టి. వసూళ్లలోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.  అలాగే, తెలంగాణ రాష్ట్రం విద్యుత్ స్వయం సమృద్ధిని సాధించిందని గవర్నర్ న్నారు. తెలంగాణ త్వరలోనే విద్యుత్ మిగులు రాష్ట్రంగా నిలుస్తుందని చెప్పారు. కొత్త పవర్ ప్లాంటుల నిర్మాణం పూర్తి కావస్తోందని ఆయన అన్నారు. సోలార్ పవర్ ప్రొడక్షన్లో తెలంగాణ దేశంలోనే నెంబర్ టూ స్థానంలో నిలిచిందన్నారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు సరిపడా కరెంటు అందుతోందని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడానికి ప్రభుత్వం భారీ నీటి ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. ప్రతీప శక్తుల ప్రతీఘాత చర్యలను, రాజకీయ దురుద్దేశంతో వేసిన బూటకపు కేసులను, వాటివల్ల వచ్చిన ఆటంకాలను ప్రభుత్వం అకుంఠిత దీక్షతో అధిగమించింది. తలపెట్టిన అన్ని ప్రాజెక్టులకు అటవీ, పర్యావరణ, పరిపాలనా అనుమతులను వివిధ కేంద్ర ప్రాధికారిక సంస్థల నుంచి పొందింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు అటవీ, పర్యావరణ అనుమతులను ఇటీవలనే సాధించుకున్నామనే శుభవార్తను మీ అందరితో పంచుకుంటున్నాను. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కూడా అన్ని అనుమతులు సాధించడానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నది. 
కుదుటపడిన వ్యవసాయం
సమైక్య రాష్ట్రంలో కుప్పకూలిన వ్యవసాయ రంగాన్ని నిలబెట్టడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు మంచి ఫలితాలను ఇచ్చాయి. వ్యవసాయం దండుగ అనే నిరాశ నిస్పృహల నుంచి రైతులను బయట పడేసేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు రైతాంగానికి గొప్ప ఊరటనిచ్చాయి.  24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తుతో రైతుల కరెంటు కష్టాలు తీరాయి. ప్రభుత్వం తీసుకున్న వ్యూహాత్మక చర్యల వల్ల సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుతున్నాయి.  కల్తీ విత్తనాలు, ఎరువుల అమ్మకాలను నిరోధించడానికి కఠినమైన చర్యలు చేపట్టింది. కల్తీలు, నకిలీలకు పాల్పడే వారిపై పిడి యాక్టు నమోదు చేయడానికి ప్రభుత్వం చట్టం కూడా తెచ్చింది. ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల కల్తీకి పాల్పడే వారిపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు.
రైతుబంధు
పంట కాలంలో పెట్టుబడి కోసం రైతాంగం అక్కడా ఇక్కడా అప్పులు చేయాల్సిన అగత్యం ఉండకూడదని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందింది. రైతులకు పెట్టుబడి కోసం ఎకరానికి 4వేల చొప్పున రెండు పంటలకు 8వేల రూపాయలు దక్కుతుండంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది. ఈ పథకాన్ని ఐక్యరాజ్యసమితి ప్రశంసించడం మనందరికీ గర్వకారణం. రైతుబంధు పథకం దేశంలో ఇప్పుడు ఓ రోల్ మోడల్ పథకంగా మారింది. చాలా రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమయ్యాయి. ప్రముఖ వ్యవసాయార్ధిక నిపుణులు అశోక్ గులాటి లాంటి వాళ్లు వ్యవసాయ సంక్షోభానికి రైతుబంధు తరహా పథకం మాత్రమే పరిష్కారమని పేర్కొన్నారు. 
రైతుబీమా
దురదృష్టవశాత్తు ఏ రైతైనా మరణిస్తే అతని కుటుంబం వీధిన పడొద్దనే మానవీయమైన ఆలోచనతో ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రైతు ఏ కారణాల వల్ల మరణించినా, ఆ రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయలను కేవలం పది రోజుల వ్యవధిలో ప్రభుత్వం అందిస్తున్నది. ఇప్పటి వరకు 5,675 మంది రైతుల కుటుంబాలకు 283 కోట్ల రూపాయలు రైతుబీమా పథకం కింద సహాయం అందించింది. వ్యవసాయ శాఖను బలోపేతం చేసేందుకు ప్రతీ ఐదువేల ఎకరాలకు ఒకరు చొప్పున  వ్యవసాయ విస్తరణాధికారులను ప్రభుత్వం నియమించింది. రైతులు పరస్పరం చర్చించుకోవడం కోసం రైతు వేదికలు నిర్మాణం తలపెట్టింది.
భూరికార్డుల ప్రక్షాళన
భూ వివాదాలను  శాశ్వతంగా పరిష్కరించడం కోసం,భూ రికార్డుల  నిర్వహణ పారదర్శకంగా ఉండడం కోసం దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయని సాహసం తెలంగాణ ప్రభుత్వం చేసింది.  భూ రికార్డుల సమగ్ర  ప్రక్షాళన కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వం చేసిన కృషితో  దాదాపు 94 శాతం భూముల యాజమాన్యాల హక్కుల విషయంలో స్పష్టత వచ్చింది. సాదా బైనామాల ద్వారా జరిగిన భూముల  క్రయ విక్రయాలకు చట్టబద్ధత కోసం   ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించింది. భూముల  రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో ఇకపై  వందకు వంద శాతం పారదర్శకత సాధించేందుకు సమూల సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని గవర్నర్ అన్నారు

Related Posts