YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

లాభాల్లో స్టాక్ మార్కెట్స్

 లాభాల్లో స్టాక్ మార్కెట్స్
స్టాక్ మార్కెట్ సోమవారం లాభాల్లో ముగిసింది. ఇండెక్స్‌లు లాభపడటం ఇది వరుసగా ఐదో రోజు. రోజంతా ఆద్యంతం ఒడిదుడుకుల మయంగా సాగింది. లాభాలతో ప్రారంభమైన ఇండెక్స్‌లు తర్వాత వెంటనే నష్టాల్లోకి జారకున్నాయి. అయితే సూచీలు మళ్లీ లాభాల్లోకి వచ్చాయి. అటుపైన ఇండెక్స్‌లు ర్యాలీ చేశాయి. అయితే తర్వాత సూచీల లాభాలు కొంతమేర తగ్గాయి. చివరకు సెన్సెక్స్ 192 పాయింట్ల లాభంతో 36,578 వద్ద, నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో 10,961 వద్ద ముగిశాయి. హెవీవెయిట్ షేర్లు లాభపడటం సూచీలకు బలానిచ్చింది. ఎనర్జీ, ఐటీ, ఫార్మా ఇండెక్స్‌లు లాభాపడ్డాయి. అదేసమయంలో వాహన, ఇన్‌ఫ్రా, ఎఫ్‌ఎంసీజీ, మెటల్ ఇండెక్స్‌లు నష్టపోయాయి. దాదాపు 930 షేర్లు లాభపడితే, 1,651 షేర్లు నష్టపోయాయి. 155 షేర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, గెయిల్, ఇన్ఫోసిస్, ఏసియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఏకంగా 4 శాతానికి పైగా ర్యాలీ చేసింది. కోటక్ బ్యాంక్ 3 శాతం మేర పెరిగింది. హీరో మోటొకార్ప్, యస్ బ్యాంక్, విప్రో, మారుతీ, బజాజ్ ఆటో, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఐఓసీ షేర్లు నష్టపోయాయి. హీరో మోటొకార్ప్ ఏకంగా 4 శాతం మేర పడిపోయింది. యస్ బ్యాంక్ కూడా 3 శాతానికి పైగా క్షీణించింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధరలు నిలకడగానే కదలాడుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 62.68 వద్ద, డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 54.09 వద్ద ఉన్నాయి. 

Related Posts