YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
దేశీ స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాల్లో ముగిసింది. దీంతో ఇండెక్స్‌ల ఐదు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్‌ 134 పాయింట్లను కోల్పోయి 36,444 వద్ద, నిఫ్టీ ఇండెక్స్‌ 39 పాయింట్ల నష్టంతో 10,923 వద్ద ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 50 పాయింట్లు కోల్పోయి 27,482 వద్ద స్థిరపడింది. ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ, హెవీవెయిట్‌ షేర్ల పతనం, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాలు మార్కెట్‌ ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. భారత్‌‌లో పెరుగుతున్న ద్రవ్యలోటుపై ఐఎంఎఫ్‌ ఆందోళన వ్యక్తం చేయడం సైతం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ముఖ్యంగా మెటల్‌, ఐటీ, అటో, ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లలో అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ అత్యధికంగా 2.20 శాతం నష్టపోగా, ఫార్మా ఇండెక్స్‌ 2 శాతం లాభపడింది. ఎన్ఎస్ఈలో సన్ ఫార్మా, విప్రో, టైటాన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, గెయిల్, హీరో మోటొకార్ప్, బజాజ్ ఫైనాన్స్, యస్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. సన్ ఫార్మా దాదాపు 5 శాతం లాభపడింది. ఇదే ఫార్మా ఇండెక్స్‌ను నిలబెట్టింది. ఇక విప్రో 3 శాతానికి పైగా పెరిగింది. అదేసమయంలో వేదాంత, టాటా స్టీల్, ఎంఅండ్ఎం, జీ ఎంటర్‌టైన్‌మెంట్, హెచ్‌సీఎల్ టెక్, మారుతీ, హిందాల్కో షేర్లు నష్టపోయాయి. వేదాంత, టాటా స్టీల్, ఎంఅండ్ఎం షేర్లు 3 శాతానికి పైగా పడిపోయాయి

Related Posts