YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

ఐడియా  మరో కొత్త ఆఫర్‌..!

Highlights

  • రూ.109 రీచార్జ్‌తో అన్‌లిమిటేడ్ కాల్స్‌ ప్యాక్‌
  • ఎంపిక చేసిన ప్రాంతాల్లోని వినియోగదారులు
  • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, గుజరాత్, హరియాణా, కర్ణాటక
  • సహా కొన్ని ప్రాంతాల్లోని వినియోగదారులు
ఐడియా  మరో కొత్త ఆఫర్‌..!

 ప్రముఖ టెలికం దిగ్గజం ఐడియా తమ వినియోగదారులను ఆకర్షించేందుకు మరో కొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది.  ఇప్పటికే పలు ఆఫర్లతో ఆకట్టుకుంటున్న ఎయిర్‌టెల్, ఐడియా సెల్యూలర్ కంపెనీలు ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ.109 రీచార్జ్‌తో అన్‌లిమిటేడ్ కాల్స్‌ ప్యాక్‌ను ప్రవేశపెట్టాయి. ప్రత్యేకించి ఎంపిక చేసిన ప్రాంతాల్లో 14 రోజుల పరిమితిపై కొత్త ప్యాక్‌ను అందిస్తున్నాయి. ఈ ప్యాక్‌ను 4జీ/3జీ అందించే ప్రాంతాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, గుజరాత్, హరియాణా, కర్ణాటక సహా కొన్ని ప్రాంతాల్లోని వినియోగదారులు పొందవచ్చు. రూ. 109 రీచార్జ్ ప్యాక్‌పై అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్‌తో పాటు 4జీ,3జీలో 1జీబీ డేటా, రోజుకు 100 లోకల్, నేషనల్ ఎస్ఎంఎస్‌లు పొందవచ్చు. వాయిస్ కాల్స్ ప్యాక్‌లో మాత్రం పరిమిత కాల్స్ రోజుకు 250 నిమిషాలు మాత్రమే కాగా, వారానికి 1,000 నిమిషాల వరకు పొందవచ్చు. ప్రీపెయిడ్ వినియోగదారులు ఈ  కొత్త రూ.109 ప్యాక్‌ను ఐడియా ఆపరేటర్ అధికారిక వెబ్‌సైట్ లేదా మై ఐడియా యాప్ ద్వారా రీచర్జ్ చేసుకోవచ్చు. 

Related Posts