YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నవ్వుకోండి

కొత్త కోడలు..

Highlights

  • ప్రియాతి ప్రియమైన అత్తయ్య గారి పాద పద్మములకు
  • ఆపాద మస్తకపు నమస్కారాలు తెలియజేస్తూ..
  • మీ కొత్త కోడలు వ్రాయునది ఏమనగా....
 కొత్త కోడలు..

ఉభయకుశలోపరి.
 నేను కాపురానికి వస్తున్నప్పుడు మీరు నాకు చెప్పిన సూక్తి ముక్తావళి అన్నిటినీ తు.చ ..తప్పకుండా పాటిస్తున్నాను.

కొత్తసంసారం పాలు పొంగినట్టు పొంగి పొర్లాలి  అని చెప్పారు. అందుకే రోజుకి రెండు లీటర్ల పాలు పొంగిస్తున్నాను . పొంగి పొర్లగా మిగిలిన పాలతో టీ చేసుకుని తాగుతున్నాం , కాకపోతే రెండు నెలలకే స్టవ్ గబ్బు కంపు కొట్టటం తో నిన్ననే కొత్త స్టవ్ కొనుకొచ్చాను. 

పనీ , పాటా నేర్చుకోమన్నా మీ మాట మీద గౌరవం తో రోజుకి 5 గంటలు , ఏ.ఆర్.రెహ్మాన్
పాటలు వింటూ  ప్రాక్టీస్ చేస్తున్నాను . పాట నేర్చుకోవడం పూర్తి కాగానే పని నేర్చుకోవడం ప్రారంభం చేస్తాను.

మీ అబ్బాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించమని చెప్పారు కదా అందుకే, వారి ఆరోగ్య దృష్ట్యా రోజుకి ఒక్కసారి మాత్రమే భోజనం పెడుతున్నాను . 

భర్త ని కష్ట పెట్టకూడదు అన్న మీ మాట గుర్తుకొచ్చి ఉదయం మాత్రమే వంట చేయిస్తున్నాను.

"చుట్టుపక్కల వారితో జాగ్రత్త" అని చెప్పారు గా అత్తయ్యా,    అందుకే నిన్న ఎదిరింటావిడ పలకరించబోతే ముఖం మీదే తలుపులు వేశాను .
 ఆవిడ ముఖం మీరు చేసిన చపాతీ లా మాడిపోయింది .

పొదుపు చేయమన్న మీ మాట తో వారానికి ఒక్క డ్రస్ మాత్రమే కొనుకుంటున్నాను . అలాగే రెండు సినిమాలు మాత్రమే చూస్తున్నాం .
ఈ నెల పొదుపు చేసిన డబ్బు తో మీ అబ్బాయి కి కొత్త కర్చీఫ్ కొనిచ్చాను .

పతియే ప్రత్యక్ష దైవం అని చెప్పారు కదా ! అందుకే నిన్న వైకుంఠ ఏకాదశి అని పూజ చేసి మీ అబ్బాయి కాళ్ళ మీద కొబ్బరికాయ కొట్టాను .పాపం కాలు వేలు చిట్లి రక్తం వస్తే కట్టు కూడా కట్టాను . తొందర్లోనే తగ్గిపోతుంది లెండి.

మీరు ఇంకా నాకు ఏమైనా సలహాలు ఇవ్వాలంటే వివరంగా ఉత్తరం వ్రాయగలరు.
                           ఇట్లు
మీ ప్రియమైన కుమారుని పాద దాసి,
వీర వెంకట నాగ వల్లీశ్వర సుబ్రమణ్య సాయి లక్ష్మీ పార్వతీ సరస్వతి 
 బాలా త్రిపుర సుందరి

                అనే
           కంచు లక్ష్మి.

Related Posts