YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

రూ.3 లక్షల కోట్ల మొండి బకాయిలు రాబట్టాం : పీయూష్ గోయల్

రూ.3 లక్షల కోట్ల మొండి బకాయిలు రాబట్టాం : పీయూష్ గోయల్

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

2019-20 సంవత్సరానికి గాను తాత్కాలిక బడ్జెట్ను ఇన్చార్జ్ ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ లోక్సభలో ప్రవేశపెట్టారు. పీయూష్ తొలిసారిగా బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా అమెరికాలో ఉండటంతో ఆయన స్థానంలో ఇన్చార్జ్ ఆర్థిక మంత్రిగా పీయూష్ గోయల్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఎన్డీయే ప్రభుత్వానికి ఇది ఆరో బడ్జెట్. ఎన్నికల నేపథ్యంలో గోయల్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. పీయూష్ మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఇంతవరకు రుణాలను చెల్లించని రుణగ్రస్థుల నుంచి రూ.3 లక్షల కోట్లు తిరిగి రాబట్టినట్లు తెలిపారు. ఈ సొమ్మును బ్యాంకులకు సమకూర్చినట్లు తెలిపారు. అధిక వృద్ధి సాధించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పారదర్శకతలో కొత్త పుంతలు తొక్కుతున్నట్లు చెప్పారు. ప్రజల ఆదాయం రెట్టింపు కావాలి. ఉగ్రవాద, మతవాద రహిత దేశంగా అవతరించాలి. వృద్ధిరేటు వేగం పుంజుకుంది. ప్రపంచంలో మనది ఆరో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ. యూపీఏ హయాంలో ద్రవ్యోల్బణం 10శాతం దాటిందని అయన అన్నారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 4.6శాతానికే పరిమితంఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నట్టు గోయల్  చెప్పారు అలాగే, గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించినట్లు తెలిపారు. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజనకు భారీగా నిధులు సమకూర్చినట్లు తెలిపారు. భారత దేశ వనరులను పేదలు మొదట అనుభవించగలిగేలా చేస్తున్నామన్నారు. గ్రామీణ రోడ్ల నిర్మాణాన్ని మూడు రెట్లు పెంచినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల్లో ఉండే సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పేదలకు ఆహారం అందజేయడానికి రూ.1.7 లక్షల కోట్లను కేటాయించినట్లు చెప్పారు. గత ప్రభుత్వాలు కేవలం ఉత్తుత్తి వాగ్దానాలను మాత్రమే చేశాయని ఆరోపించారు. సన్న కారు రైతుల ప్రయోజనం కోసం 2019-20 ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్లో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. 12 కోట్ల మంది రైతులు దీనివల్ల ప్రయోజనం పొందుతారని పీయూష్ గోయల్ తెలిపారు. నేరుగా రైతుల ఖాతాల్లోకే సొమ్ము చేరే విధంగా ఈ పథకాన్ని రూపొందించినట్లు చెప్పారు. ఈ పథకం 2018 డిసెంబరు నుంచి అమల్లోకి వస్తుందన్నారు. రైతు కుటుంబాలు ఈ పథకం వల్ల సంతోషంగా జీవించాలన్నదే తమ లక్ష్యమన్నారు. వ్యవసాయ ఆదాయ మద్దతు పథకంలో భాగంగా ప్రతి సంవత్సరం రూ.6,000 నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పారు. గోకుల్ మిషన్ కోసం రూ.750కోట్లు కేటాయిస్తున్నాం. గో ఉత్పాదకత పెంచడానికి రాష్ట్రీయ కామ్ధేన్ ఆయోగ్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. గ్యాట్యుటీ పరిమితిని రూ.10లక్షల నుంచి రూ.30లక్షలకు పెంచుతున్నాం. కొత్త పెన్షన్ విధానం సరళీకరిస్తాం! పెన్షన్లో ప్రభుత్వ వాటా 14శాతానికి పెంపు. కార్మికులు, కూలీల కోసం ప్రత్యేక పథకాలు. ఈపీఎఫ్వో సభ్యుల సంఖ్య రెండేళ్లలో 2కోట్లు పెరిగింది. కార్మిక ప్రమాద బీమా మొత్తం రూ.1.50లక్షల నుంచి రూ.6లక్షలకు పెంచుతున్నామని అయన వెల్లడించారు. అసంఘటిత కార్మికులకోసం ప్రధానమంత్రి శ్రమయోగి బంధన్ పేరుతో పింఛన్ ప్రారంభించామని అన్నారు.. 60ఏళ్లు నిండిన వారందరికీ ప్రతి నెలా రూ.3వేలు పింఛన్ వచ్చే విధంగా పథకం. నెలకు రూ.100 చొప్పున ప్రీమియం చెల్లిస్తే 60ఏళ్ల తర్వాత రూ.3వేల పింఛన్. అసంఘటిత రంగంలోని 10కోట్లమంది కార్మికులకు ఈ పథకం వర్తిస్తుందని అయన అన్నారు. మహిళల అభివృద్ధి నుంచి మహిళల నేతృత్వంలో అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తామని బడ్జెట్ ప్రసంగంలో పీయూష్ గోయల్ చెప్పారు. నీతీ ఆయోగ్ ఆధ్వర్యంలోని కమిటీ ఆదివాసీలను గుర్తిస్తుందని తెలిపారు. ఈ వర్గాల కోసం ప్రత్యేక వ్యూహాలను రూపొందిస్తామని చెప్పారు. ఉజ్వల యోజన క్రింద మహిళలకు 6 కోట్ల ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లను ఇచ్చామన్నారు. మరో 2 కోట్ల మంది పేదలకు వచ్చే ఏడాది సమకూర్చుతామని చెప్పారు.

Related Posts

0 comments on "రూ.3 లక్షల కోట్ల మొండి బకాయిలు రాబట్టాం : పీయూష్ గోయల్"

Leave A Comment