
కడప
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి సందర్భంగా వైఎస్సార్ తనయుడు, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఆయనతో పాటు తన తల్లి విజయమ్మ నివాళి ఘటించారు. ఈ జయంతి కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
వైఎస్సార్ కు నివాళులర్పించిన వైఎస్ షర్మిలా
మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ 76 వ జయంతి సందర్బంగా ఇడుపుల పాయ ఘాట్ వద్ద ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఘన నివాళులు అర్పించారు.
షర్మిలా మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మెమోరియల్ హైదరాబాద్ లో సైతం ఉండాలి. ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీ,తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖల ద్వారా విజ్ఞప్తి చేశా. రేవంత్ రెడ్డి, వైఎస్సార్ మెమోరియల్ ఏర్పాటుపై చొరవ చూపాలని కోరుతున్ననని అన్నారు.
వైఎస్సార్ ఉమ్మడి . రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రెండు సార్లు పని చేశారు. రాష్ట్రంలో నే కాదు దేశంలోనే అధికారంలో కాంగ్రెస్ అధికారంలో రావడంలో వైఎస్సార్ కీలకం. పరిపాలన, పథకాలతో కోట్ల మందిని తాకారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్, జలయజ్ఞం లాంటి పథకాలు అయన మార్క్. వైఎస్సార్ చనిపోతే ఆయన వెనకాలే 700 మంది ప్రాణాలు వదిలారు. వైఎస్సార్ జయంతులకు,వర్ధంతులకు నివాళులు అర్పించేందుకు మెమోరియల్ ఉండాలి. రేవంత్ అన్న సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్ననని అన్నారు.