YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

హైటెక్‌ వ్యభిచారం ముఠా గుట్టు రట్టు

హైటెక్‌ వ్యభిచారం ముఠా గుట్టు రట్టు

జూబ్లీహిల్స్‌లో హైటెక్ సెక్స్‌ రాకెట్‌ ముఠా గుట్టు రట్టయింది. ప్రశాసన్ నగర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ప్రధాన సూత్రధారి ఫయీజ్‌ను అరెస్టుచేశారు. ఓ డూప్లెక్స్ ఇంటిలో నెల్లూరుకు చెందిన షేక్ ఫయాద్ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. కోల్‌కతా, ముంబయి ప్రాంతాల నుంచి యువతులను వారం, పది రోజుల పాటు ఇక్కడికి తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పదేళ్ల నుంచి షేక్ ఫయాద్ వ్యభిచారం నిర్వహిస్తుండగా..
హైదరాబాద్‌లో మాత్రం రెండేళ్ల నుంచి సాగిస్తున్నాడని జూబ్లీహిల్స్ ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. అతడి బారినుంచి కోల్‌కతాకు చెందిన ఇద్దరు యువతులు, మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ యువతిని రక్షించామని ఏసీపీ వెల్లడించారు. హెటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ప్రధాన నిర్వాహకుడు షేక్ ఫయాద్‌తో పాటు అతనికి సహకరించిన సురేశ్, జోసెఫ్ అనే వ్యక్తులను అరెస్టు చేసినట్టు చెప్పారు. నిందితుల నుంచి రూ.12 వేల నగదు, మూడు మొబైల్‌ ఫోన్‌లు, 20 కండోమ్‌లను స్వాధీనం చేసుకున్నారు.

ప్రధాన నిర్వాహకుడు ఫయాద్ ఆరుగురు దళారులను ఏర్పాటు చేసుకుని ఈ చీకటి వ్యాపారం సాగిస్తున్నట్టు ఏసీపీ తెలిపారు. నిందితులను కస్టడీకి తీసుకుని మరింత లోతుగా విచారణ చేస్తామన్నారు. ప్రశాసన్ నగర్‌లోని ఆ ఇంటి యజమాని ముంబయిలో ఉంటాడని పోలీసులు తెలిపారు.

Related Posts