
148 మంది బాలికలను అక్రమ రవాణా చేస్తుండగా ప్రత్యేక రైడ్ నిర్వహించి పోలీసులు కాపాడిన దారుణ ఘటన మణిపూర్‌లో వెలుగు చూసింది. టెంనౌపాల్ ప్రాంతం నుంచి బాలికలను అక్రమ రవాణా చేస్తుండగా గుర్తించి కాపాడినట్లు పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో ఇంత పెద్ద ఆపరేషన్ జరగడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. ఇలాంటి ఆపరేషన్లు కొన్ని ఎన్జీవోల సాయంతో చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.