YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఆదాయంలో సౌత్ సెంట్రల్ రైల్వే టాప్

ఆదాయంలో సౌత్ సెంట్రల్ రైల్వే టాప్

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

దక్షిణ మధ్య రైల్వే డబుల్ ధమాకా సాధించింది. ఓ పక్క ప్రయాణికుల టిక్కెట్ల అమ్మకాలు, రెండోవైపుసరుకు రవాణాతో భారీగా రాబడితో కాసుల వర్షం కురిసింది. సంక్రాంతి ప్రత్యేక రైళ్ల ద్వారా భారీగా ఆదాయం ఆర్జించింది. అలాగే 100 మిలియన్ల టన్నుల సరుకులు సరఫరా చేయడంతో ఇబ్బడి ముబ్బడిగా లాభాలొచ్చాయి. 2018 ఏప్రిల్ నుంచి 2019 జనవరి 31 వరకూ రూ. 8,655 కోట్లు సాధించింది. దక్షిణ మధ్య రైల్వే దేశంలో మిగతా జోన్లకంటే ప్రధమ స్థానంలో నిలిచిందని రైల్వే అధికారులు ప్రకటించారు.ఈ ఏడాది మార్చి నాటికి 120 మిలయన్ల టన్నుల సరుకు రవాణాతో లక్ష్యాలను అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గత ఏడాదికి పోల్చితే రూ.1, 764 కోట్ల రాబడి అదనంగా సమకూరింది. వ్యాగన్లు ద్వారా అత్యధికంగా 53,555 మిలియన్ టన్నుల బొగ్గును రవాణా చేసింది. సిమెంట్ 22,948 మిలియన్ టన్నులు, ఎరువులు 5,374, ఇనుప ఖనిజం 5,183, ఆహార ధాన్యాలు 3,925, స్టీల్ ప్లాంట్‌ల కోసం ముడి సరుకు 2,275, ఇతరత్రా సరుకుల ద్వారా 5, 07 మిలియన్ టన్నులు రవాణా చేసింది. బొగ్గు 31 శాతం, ఇనుప ఖనిజం 36 శాతం, సిమెంట్ 10 శాతం, ఎరువులు 7 శాతం, కంటైనర్ ద్వారా 26 శాతం, అన్ని విభాగాల నుంచి 100.052 మిలియన్ల టన్నుల సరుకును రవాణా చేసి లక్ష్యాలను సాధించింది. గత ఏడాదితో పోలిస్తే 21 శాతం రాబడిని ఎక్కువ సాధించింనట్లు అధికారులు వెల్లడించారు. రైల్వేకి గణనీయంగా ఆదాయం రావడానికి సింగరేణి బొగ్గు రవాణ ముఖ్యపాత్ర పోషించిందని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్‌కే కుల్‌శ్రేష్ట తెలిపారు. బొగ్గు రవాణాలోనూ దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో ఎక్కువ రాబడి వచ్చిందని ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్ మధుసూదనరావుచెప్పారు. గత ఏడాదికి పోలిస్తే సింగరేణి నుంచి 5, 523 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా ఎక్కవగా జరిగిందన్నారు. 2018-2019 ఆర్థిక సంవత్సరంలో అధిక రాబడి సాధించించడానికి కృషి చేసిన రైల్వే ఉద్యోగులు, సిబ్బందిని మధుసూదనరావు అభినందించారు. సంక్రాంతి పండుగ సెలవుల్లో రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లు నడిపి 4.50 లక్షల మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చామన్నారు. 

Related Posts