YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

పిఎన్ బీ స్కాముకు బ్యాంకర్లదే బాధ్యత 

Highlights

  •  ఏడీఎఫ్‌ఐఏపీ వార్షిక సమావేశంలో అరుణ్‌జైట్లీ
పిఎన్ బీ స్కాముకు బ్యాంకర్లదే బాధ్యత 

 పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో చోటుచేసుకున్నరూ.11,400 కోట్ల కుంభకోణానికి ఆడిటర్లు, బ్యాంకర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ఈ స్కాంపై తొలిసారి స్పందించిన జైట్లీ బ్యాంకుల నిర్వహణపై మండిపడ్డారు. నిర్ణయాలు తీసుకునే అధికారం బ్యాంకు మేనేజ్‌మెంట్‌కి ఉంటే, దాన్ని సమర్థవంతంగా, సరియైన పద్ధతిలో ఉపయోగించుకోవాలన్నారు. బ్యాంకుల సిస్టమ్‌ నమ్మకం, రుణగ్రహీత, రుణదాత రిలేషన్‌షిప్‌పై ఆధారపడి ఉంటుందన్నారు. ఒకవేళ దానిలో ఏమైనా లోపాలు గుర్తిస్తే, దానికి వారే బాధ్యత వహించాలి  అని జైట్లీ ఏడీఎఫ్‌ఐఏపీ వార్షిక సమావేశంలో అన్నారు. ఆడిటర్లు ఏం చేస్తున్నారు? అంతర్గత, బహిర్గత ఆడిటర్లు దీన్ని గుర్తించడం విఫలమైతే, సీఏ నిపుణులు గురించి తీవ్రంగా ఆలోచించాల్సి ఉందని భావిస్తున్నానన్నారు.
ఇదిలా ఉండగా  ఈ స్కాం వెలుగులోకి వచ్చాక, ఈడీ, సీబీఐ వీరి సంస్థలపై భారీ ఎత్తున్న తనిఖీలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మోసంలో 120 షెల్‌ కంపెనీలు పాలుపంచుకున్నట్టు ఈడీ ఆరోపిస్తోంది. వీటిలో 80 కంపెనీలు నీరవ్‌ మోదీ, చౌక్సి రన్‌ చేస్తున్నట్టు పేర్కొంది. ఈ కేసులో భాగమైన మెహుల్‌ చౌక్సి ప్రమోటర్‌గా ఉన్న గీతాంజలి జెమ్స్‌, దాని అసోసియేటెడ్‌ సంస్థలపై ఐటీ కూడా దాడులు నిర్వహిస్తోంది. 
 

Related Posts