YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

రోజుకో మలుపు తిరుగుతున్న జయరామ్ కేసు

రోజుకో మలుపు తిరుగుతున్న జయరామ్ కేసు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, పారిశ్రామిక వేత్త చిరుగుపాటి జయరాం హత్య కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. నిందితులను రక్షించేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తున్నారని, వారిపై తమకు నమ్మకం లేదని జయరాం భార్య పద్మశ్రీ ఆరోపించిన విషయం తెలిసిందే. తన భర్త హత్యపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆమె హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. జయరాం హత్య తెలంగాణ పరిధిలోనే జరిగింది కాబట్టి ఈ కేసును అక్కడికే బదిలీ చేయాలని చట్టప్రకారం నిర్ణయించారు. దీంతో కేసును తెలంగాణకు బదిలీ చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీ ఆదేశించారు. మరోవైపు, కేసు నమోదుపై జూబ్లీహిల్స్ పోలీసులు న్యాయనిపుణుల సలహా తీసుకునే పనిలో ఉన్నారు. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితులు రాకేశ్ రెడ్డి, వాచ్‌మెన్ శ్రీనివాస్‌లను నందిగామ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయస్థానం వారికి ఫిబ్రవరి 20 వరకూ రిమాండ్ విధించింది. జయరాం హత్య కేసులో వీరిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు కోర్టును కోరే అవకాశముంది. తన భర్తను హైదరాబాద్‌లో హత్యచేసి మృతదేహాన్ని ఆంధ్ర ప్రాంతంలోకి తీసుకెళ్లడం ద్వారా కేసును పరిధి దాటించారని పద్మశ్రీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసును తెలంగాణ పోలీసులు విచారించాలని, ఏపీ పోలీసులను శిఖా చౌదరి ప్రభావితం చేసి ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ కేసులో తనకు చాలా అనుమానాలు ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. జయరాం మృతదేహాన్ని నందిగామ వద్ద గుర్తించడంతో ఏపీ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. 

Related Posts