YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎంపీ స్థానాలకు భారీగా దరఖాస్తులు

ఎంపీ స్థానాలకు భారీగా దరఖాస్తులు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

రాష్ట్రంలో జరుగుతున్న ఎర్రజొన్న, పసుపు రైతులు ఆందోళనలు ప్రభుత్వానికి పట్టడంలేదు. ఎర్రజొన్నలను కొనుగులు చేశామన్న ప్రభుత్వం మాటలు అబద్దమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఎర్రజొన్నకు మూడువేలు మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగులు చేయాలి. ప్రభుత్వ తీరుతో దళారులు ఎర్రజొన్న రైతులను మోసం చేస్తున్నారు. పసుపు బోర్డు పెట్టిస్తామన్న ఎంపీ కవిత మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పసుపు రైతులనుండి ఇప్పుడు కొనేవారులేరు .? పసుపు ను 10వేల క్వింటాలు కు సర్కార్ కొనాలి. ప్రభుత్వం తీరుతోనే వ్యవసాయ రంగం దిగజారిపోతోంది.  రైతులకు ఎక్కడ అవసరం వచ్చినా అక్కడికి కాంగ్రెస్ శాసన సభ పక్షం వెళ్తుందని అన్నారు. ఎంపీ స్థానాలకు భారీగా దరఖాస్తులు వచ్చాయి.  ఈ నెలాఖరు వరకు అభ్యర్ధుల ప్రకటన వుంటుంది. నెలాఖరికి పొత్తుల మీద కూడా క్లారిటీ వస్తోంది. రాష్ట్ర నాయకులు చర్చ చేసి  పొత్తులపై నిర్ణయాన్ని అధిష్ఠానానికి పంపుతాం.  అధిష్ఠానం ఫైనల్ గా నిర్ణయం ప్రకటిస్తుందని అన్నారు. 

Related Posts