YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

 టీఆర్‌టీ హాల్‌టికెట్లలో గందరగోళం

Highlights

  •  టెట్‌ పరీక్ష కేంద్రంలో మొరాయించిన సర్వర్‌
  • సామర్థ్యానికి మించి అభ్యర్థుల కేటాయింపు
  • ఈ మధ్యాహ్నం నుంచి అందుబాటులోకి టీఆర్‌టీ హాల్‌టికెట్లు
  • పరీక్ష కేంద్రం వద్దే అభ్యర్థుల నిరీక్షణ 
 టీఆర్‌టీ హాల్‌టికెట్లలో గందరగోళం

ఉపాధ్యాయ నియామక(టీఆర్‌టీ) పరీక్ష నిర్వహణలో ఇటు ఏపీ, అటు తెలంగాణ రాష్ట్రాల్లో గందరగోళం నెలకొంది. తెలంగాణలో ఆఖరి నిమిషంలో పరీక్ష కేంద్రాలు మార్చడంతో విద్యార్థులు ఇబ్బందులెదుర్కోవాల్సి వచ్చింది. కాగా ఇక్కడ కూడా పరీక్ష కేంద్రాల్లో సామర్థ్యానికి మించి అభ్యర్థులను కేటాయించడంతో కొంతమంది పరీక్ష కేంద్రాల వద్దనే నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురయ్యింది. హిందూపురం టెట్‌ పరీక్షా కేంద్రంలో సర్వర్‌ మొరాయించడంతో పరీక్ష నిలిచిపోయింది. అంతేకాక పరీక్షా కేంద్రంలో అందుబాటులో ఉన్న కంప్యూటర్లకంటే ఎక్కువమంది అభ్యర్థులను కేటాయించారు అధికారులు. 
టీఎస్‌పీఎస్సీ తప్పిదం..


తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) నిర్వహించనున్న టీఆర్‌టీ పరీక్షల హాల్‌టికెట్ల జారీలో సాంకేతికపరమైన తప్పిదాలు తెలెత్తాయి. ఇప్పటికే పరీక్షల నిర్వహణ, అభ్యర్థుల ఎంపిక లాంటి విషయాల్లో టీఎస్‌పీఎస్సీ అప్రతిష్ట మూటకట్టుకోగా తాజాగా టీఆర్టీ విషయంలోనూ విద్యార్థులను గందరగోళంలోకి నెట్టేస్తోంది. గతంలో జరిగిన గ్రూప్‌-1 ఫలితాల్ని సవరించి ఇవ్వగా, గురుకులాల్లో డిగ్రీ, జూనియర్‌ లెక్చరర్ల ప్రధాన పరీక్షల అభ్యర్థుల జాబితా ప్రకటించి వెనక్కి తీసుకుంది. ప్రస్థుతం అత్యంత కీలకమైన ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) నిర్వహణకు ముందుగానే సాంకేతిక తప్పిదం జరిగింది.
టీఆర్‌టీ ద్వారా 8,792 ఉపాధ్యాయ పోస్టులకు దాదాపు 2.77 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ నెల 24 నుంచి మార్చి 4 వరకు పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు అప్లికేషన్‌లో ఇచ్చిన ఆప్షన్ మేరకు కాకుండా దూరంగా ఉన్న జిల్లాలో ఎగ్జామ్ సెంటర్లను కేటాయించారు. దీంతో అభ్యర్థుల నుంచి భారీ స్థాయిలో ఫిర్యాదులు అందడంతో హాల్‌టికెట్ల లింకును టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ నుంచి తొలగించింది.
సోమవారం అర్ధరాత్రి నుంచి లింక్ అందుబాటులోకి రావడంతో అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. తాము ఇచ్చిన ఆప్షన్‌కు భిన్నంగా వేర్వేరు జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను కేటాయించడంతో అభ్యర్థుల నుంచి పెద్దఎత్తున టీఎస్‌పీఎస్సీకి ఫిర్యాదులు అందాయి. దీంతో టీఎస్‌పీఎస్సీ పరిస్థితిని సమీక్షించి వెంటనే హాల్ టికెట్ లింకును తొలగించింది. సాంకేతిక తప్పిదం కారణంగానే ఈ గందరగోళం ఏర్పడిందని గుర్తించిన టీఎస్‌పీఎస్సీ..
అభ్యర్థుల డేటాను మరోసారి సరిచేసి, హాల్ టికెట్లు జారీ చేయాలని నిర్ణయించింది. లాంగ్వేజ్ పండిట్, స్కూల్ అసిస్టెంట్(తెలుగు), పీఈటీ పోస్టులకు పాత జిల్లాల్లో ఎగ్జామ్ సెంటర్లను కేటాయించాలని నిర్ణయించిన కారణంగానే ఇబ్బందులు వచ్చాయని తెలిసింది. అభ్యర్థులకు వీలయినంత సమీప కేంద్రాలను కేటాయిస్తామని, సవరించిన హాల్ టికెట్లు త్వరలోనే వెబ్ సైట్‌లో పొందుపరుస్తామని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది.
మరోవైపు ఒకే పోస్టుకు వేర్వేరు జిల్లాల్లో రెండుకంటే ఎక్కువ దరఖాస్తులు చేసిన వారికి మాత్రం(మూడు జిల్లాల్లో దరఖాస్తు చేస్తే) రెండు హాల్‌టికెట్లు జనరేట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఫీజు చెల్లించిన దాని ప్రకారం హాల్‌టికెట్లు ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.ఎన్ని జిల్లాల్లో దరఖాస్తు చేసుకున్నా.. చివరకు పరీక్ష రాసేది ఒకే జిల్లాలో అయినపుడు హాల్ టికెట్టు జారీ చేయడానికి అభ్యంతరమేంటని ప్రశ్నిస్తున్నారు.


టెట్‌ పరీక్ష నిర్వహణలో ఇటు ఏపీ, అటు తెలంగాణ రాష్ట్రాల్లో గందరగోళం నెలకొంది. తెలంగాణలో ఆఖరి నిమిషంలో పరీక్ష కేంద్రాలు మార్చడంతో విద్యార్థులు ఇబ్బందులెదుర్కోవాల్సి వచ్చింది. కాగా ఇక్కడ కూడా పరీక్ష కేంద్రాల్లో సామర్థ్యానికి మించి అభ్యర్థులను కేటాయించడంతో కొంతమంది పరీక్ష కేంద్రాల వద్దనే నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురయ్యింది. హిందూపురం టెట్‌ పరీక్షా కేంద్రంలో సర్వర్‌ మొరాయించడంతో పరీక్ష నిలిచిపోయింది. అంతేకాక పరీక్షా కేంద్రంలో అందుబాటులో ఉన్న కంప్యూటర్లకంటే ఎక్కువమంది అభ్యర్థులను కేటాయించారు అధికారులు. దీంతో టెట్‌ పరీక్ష కేంద్రం వద్దే అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు.
మధ్యాహ్నం నుంచి హాల్‌టికెట్లు..
బుధవారం మధ్యాహ్నం నుంచి టీఆర్‌టీ(టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్) హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ వాణీప్రసాద్ వెల్లడించారు. టీఆర్‌టీ హాల్‌టికెట్ల గందరగోళంపై సీజీజీ అధికారులతో వాణీప్రసాద్ సమీక్షించారు. సెంటర్ల కేటాయింపు విషయంలో తప్పులు దొర్లడంతో హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 24 నుంచి యథావిధిగా టీఆర్‌టీ పరీక్షలు జరుగుతాయని వాణీప్రసాద్ స్పష్టం చేశారు.

Related Posts