YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

మావోయిస్టు సుధకార్ లోంగుబాటు

మావోయిస్టు సుధకార్ లోంగుబాటు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు సుధాకర్ అలియాస్ సత్వాజి  తన భార్యతో సహా పోలీసులకు లొంగిపోయాడు. బుధవారం తెలంగాణ రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి సమక్షంలో సుధాకర్ పోలీసులకు లొంగిపోయాడు. సుధాకర్ నిర్మల్ జిల్లా సారంగాపూర్కు చెందిన వాడని డిజిపి చెప్పారు. మావోయిస్టు పార్టీలో సుధాకర్ వివిధ హోదాల్లో పని చేశాడని ఆయన అన్నారు. సుధాకర్ కొరియర్ స్థాయినుంచి సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఎదిగాడని ఆయన అన్నారు. ఎక్కువ కాలం మావోయిస్టు మిలిటరీ విభాగంలో పని చేశాడని డిజిపి చెప్పారు. మావోయిస్టు పార్టీలో కుల వ్యవస్థ ఉందని చెప్పాడని ఆయన అన్నారు. పార్టీ లో అప్పటి సిద్ధాంతాలు ఎప్పుడు లేకపోవడం. తమ ఉనికి కోసం మాత్రమే పాటుపడటం చూసి నిస్పృహ తో లొంగిపోయాడు. సుధాకర్పై 25 లక్షల రూపాయిలు, భార్య అరుణ పై 10 లక్షల రూపాయిలు ప్రభుత్వ రివార్డు ఉందని డిజిపి అన్నారు. సుధాకర్ భార్య అరుణ స్టేట్ కమిటీలో సభ్యురాలని ఆయన చెప్పారు డీజీపీ మాట్లాడుతూ గతంలో హైదరాబాద్ లో టాటా మధు అనే వ్యక్తి ని అరెస్ట్ చేశాం. వారు చెప్పిన సమాచారం మేరకు సత్వజి ని అరెస్ట్ చేశాం. అతడినుంచి 12 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం. 1989 జైల్ లో సత్వజికి వరవరరావు పరిచయం అయ్యాడు. విడుదల అయ్యాక రైతు కూలి సంఘంలో పనిచేశాడు. అంచలంచలుగా 2014 నుండి 2019 వరకు బీహార్ జార్ఖండ్ సెంట్రల్ కమిటీ మెంబెర్ గా పని చేశాడని డీజీపీ తెలిపారు. 

Related Posts