YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

నష్టాల్లో స్టాక్ మార్కెట్

నష్టాల్లో స్టాక్ మార్కెట్
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
దేశీ స్టాక్ మార్కెట్ బుధవారం కూడా నష్టాల్లో ముగిసింది. సూచీలు నష్టపోవడం ఇది వరుసగా ఐదో సెషన్. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు ఉదయం లాభాలతోనే ప్రారంభమయ్యాయి. అయితే చివరికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 120 పాయింట్ల నష్టంతో 36,034 పాయింట్ల వద్ద, నిఫ్టీ 38 పాయింట్ల నష్టంతో 10,794 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. దాదాపు రెండు వారాల తర్వాత నిఫ్టీ 10,800 పాయింట్ల దిగువున ముగిసింది. ఇది మార్కెట్‌లో బేరిష్‌ ట్రెండ్‌ను సూచిస్తోంది. నిఫ్టీ 50లో అదానీ పోర్ట్స్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, యూపీఎల్, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్ షేర్లు లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్ 5 శాతం మేర ర్యాలీ చేసింది. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 4 శాతంమేర పెరిగింది. అదేసమయంలో ఐషర్ మోటార్స్, ఐఓసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ, గెయిల్, ఏసియన్ పెయింట్స్ షేర్లు నష్టపోయాయి. ఐషర్ మోటార్స్ షేరు 5 శాతం మేర పతనమైంది. ఐఓసీ, హెచ్‌పీసీఎల్ షేర్లు 4 శాతం మేర పడిపోయాయి. క్రూడ్ ధరలు పెరగడం వల్ల ఆయిల్ రంగ షేర్లు నష్టపోయాయి. సెక్టోరల్ ఇండెక్స్‌ల విషయానికి వస్తే.. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ మినహా మిగతావన్నీ నష్టాల్లోనే క్లోజయ్యాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ ఏకంగా 2 శాతానికి పైగా పడిపోయింది. నిఫ్టీ ఆటో ఇండెక్స్ కూడా 1 శాతానికి పైగా నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 1.41 శాతం పెరుగుదలతో 63.30 డాలర్లకు, డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 1.05 శాతం పెరుగుదలతో 53.67 డాలర్లకు చేరింది. 

Related Posts