YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

జయరాం హత్య కేసులో తెలంగాణ పోలీసులు జోరు

జయరాం హత్య కేసులో తెలంగాణ  పోలీసులు జోరు
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపారవేత్త జయరాం హత్య కేసులో తెలంగాణ  పోలీసులు జోరు పెంచారు. ఇప్పటికే నిందితులు రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్ లను అరెస్ట్ చేసిన అధికారులు తాజాగా జయరాం మేనకోడలు శిఖా చౌదరిని విచారణకు రావాలని ఆదేశించారు. దీంతో ఆమె హైదరాబాద్ లోని ఏసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. రాకేశ్ రెడ్డితో పరిచయం, జయరాం ఇంటికి హత్య రోజు రాత్రి ఎందుకు వెళ్లారు? అనే కోణంలో పోలీసులు శిఖా చౌదరిని విచారించారు.మరోవైపు ఈ కేసుకు సంబంధించి 30 మంది నిందితులను అధికారులు  విచారించారు. వీరిలో ప్రముఖ కమెడియన్ సూర్యప్రసాద్ అలియాస్ డుంబు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, నిందితుడు రాకేశ్ రెడ్డి కాల్ లిస్ట్ పై దృష్టి సారించిన తెలంగాణ పోలీసులు ఇప్పటికే ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు.  కేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌ రెడ్డితో పాటు హైదరాబాద్‌కు చెందిన రౌడీ షీటర్‌ నగేశ్‌ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. జయరామ్‌ను హత్య చేసిన రోజు ఘటనా స్థలంలో నగేశ్ ఉండటమే కాకుండా హత్యకు సహకరించినట్లు సమాచారం. అలాగే జయరామ్‌ను ట్రాప్ చేసేందుకు అమ్మాయి పేరుతో రాకేష్‌ రెడ‍్డితో పాటు నగేశ్‌ కూడా వాట్సాప్ చాటింగ్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే జయరామ్‌ను బయటకు రప్పించి, కిడ్నాప్ చేయడమే కాకుండా, అతడితో తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడి అయ్యాయి. ఇప్పటికే నగేశ్‌పై ఎస్‌ఆర్ నగర్ పోలీసు స్టేషన్ రౌడీ షీటర్ కేసు నమోదైంది. గత కొంతకాలంగా రాకేష్ రెడ్డి...నగేశ్‌తో కలిసి దందాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక జయరామ్‌ మేనకోడలు శిఖా చౌదరి పరిచయమయ్యాక ఆమె ద్వారా రాకేష్‌కు జయరాం స్నేహితుడు అయ్యాడు. ఈ నేపథ్యంలో జయరామ్‌ ఆస్తిపై కన్నేసిన రాకేష్...ఎలాగైనా ఆస్తిని చేజిక్కించుకోవాలని భారీ స్కెచ్ వేశాడు. అందుకోసం నగేశ్ సహకారం కూడా తీసుకున్నాడు. పోలీసులు తమ విచారణలో భాగంగా నగేశ్‌తో పాటు సిరిసిల్లకు చెందిన రియల్ ఎస్టేట్‌ వ్యాపారులు అంజిరెడ్డి, చొక్కారామ్‌లను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. జయరామ్ హత్యకు ముందు, ఆ తర్వాత రాకేష్‌ రెడ్డి వీరితో ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెంబర్ 10లోని రాకేష్‌ నివాసంలో పోలీసులు.. సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌ చేశారు. అలాగే హత్య జరిగిన ప్రాంతంలో నిందితుల వాంగ్ములం నమోదు చేశారు. రాకేష్‌ రెడ్డి నివాసంతో పాటు, కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు. హత్య జరిగిన రోజు రాకేష్ ఇంటికి పలువురు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు కృష్ణాజిల్లా నందిగామ టోల్ గేట్ వద్ద సీసీ ఫుటేజ్‌ను సేకరించారు

Related Posts