YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

జయరాం హత్యకు రియల్ ఎస్టేట్ వ్యాపారుల సహకారం 11 మంది అధికారుల పాత్రపై విచారణ

జయరాం హత్యకు రియల్ ఎస్టేట్ వ్యాపారుల సహకారం            11 మంది అధికారుల పాత్రపై విచారణ

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డితో పాటు మరో నిందితుడు శ్రీనివాస్‌ను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులకు మరికొన్ని కీలక విషయాలు తెలిశాయి. కోటీశ్వరుడైన జయరాం నుంచి డబ్బు రాబట్టేందుకు రాకేష్ నకిలీ పత్రాలు సృష్టించినట్టు వెల్లడైంది. ఈ హత్య కేసులో కొందరు పోలీసు అధికారుల ప్రమేయం ఉన్నట్టు ఇప్పటికే తెలిసింది. మొత్తం 11 మంది అధికారుల పాత్రపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.రాకేష్‌తో సంబంధమున్న పోలీసు అధికారులకు నోటీసుల జారీకి రంగం సిద్ధమైంది. అలాగే ఈ కేసులో రౌడీ షీడర్ నగేష్ ప్రమేయం కూడా ఉన్నట్టు తెలిసింది. నగేష్ సాయంతో జయరాం నుంచి రాకేష్ డబ్బులు రాబట్టేందుకు ప్లాన్ చేసినట్టు తెలిసింది. అలాగే జయరాం హత్యకు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సహకరించినట్టు పోలీసులు గుర్తించారు. సిరిసిల్లకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంజిరెడ్డి, గడ్డం శ్రీను, చొక్కారామ్‌లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. జయరాంతో రాకేష్ సుమారు 10 ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు చేయించినట్టుగా పోలీసులు గుర్తించారు.

Related Posts