YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

 నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
దేశీ స్టాక్ మార్కెట్ శుక్రవారం కూడా నష్టాల్లో ముగిసింది. సూచీలు నష్టపోవడం ఇది వరుసగా ఏడో సెషన్. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు ఉదయం లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. అయితే వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. పుల్వామా ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో మిడ్ సెషన్‌లో ఇండెక్స్‌లు ఒక శాతానికి పైగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్ల మేర పడిపోయింది. అయితే తర్వాత సూచీల నష్టాలు రికవరీ అయ్యాయి. చివరకు సెన్సెక్స్‌ 67 పాయింట్ల నష్టంతో 35,809 పాయింట్ల వద్ద, నిఫ్టీ 22 పాయింట్ల నష్టంతో 10,724 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. 2018 అక్టోబర్ 28 నుంచి చూస్తే ఇండెక్స్‌లు ఒక వారంలో ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే ప్రథమం. నిఫ్టీ 50లో బీపీసీఎల్, ఎన్‌టీపీసీ, గెయిల్, పవర్ గ్రిడ్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, ఓఎన్‌జీసీ, రిలయన్స్, ఎల్అండ్‌టీ, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. బీపీసీఎల్, ఎన్‌టీపీసీ షేర్లు 3 శాతానికి పైగా పెరిగాయి. రిలయన్స్ 2 శాతం మేర లాభపడింది. అదేసమయంలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, సన్ ఫార్మా, హీరో మోటొకార్ప్, టాటా స్టీల్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, హిందాల్కో, వేదాంత, హెచ్‌పీసీఎల్ షేర్లు నష్టపోయాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఏకంగా 5 శాతం పడిపోయింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కోలుకుంది. చివరకు 4 శాతం మేర నష్టపోయింది.సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ముగిశాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ ఏకంగా 3 శాతానికి పైగా పతనమైంది. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ మెటల్, నిఫ్టీ మీడియా, నిఫ్టీ ఆటో ఇండెక్స్‌లు కూడా 2 నుంచి 1 శాతం మధ్యలో పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.15 శాతం పెరుగుదలతో 64.67 డాలర్లకు పెరిగింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.11 శాతం పెరుగుదలతో 54.47 డాలర్లకు చేరింది. మరోవైపు ఇండియన్ రూపాయి 0.17 శాతం క్షీణతతో 71.28 స్థాయికి క్షీణించింది. 

Related Posts