YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

కన్యత్వాన్ని వేలం

Highlights

  • ‘రైట్‌ టు ది ఫస్ట్‌ నైట్‌' 
  • డేటింగ్‌ వెబ్‌సైట్లు
  •  ‘బ్యాడ్‌ గర్ల్స్‌ క్లబ్‌'
కన్యత్వాన్ని వేలం

కన్యత్వాన్ని వేలం వేసుకోవడం అరుదుగా చూస్తుంటాం. కన్యత్వ వేలం అనేది గతంలో అరుదుగా చోటుచేసుకొనేది. కానీ, ప్రస్తుతం రష్యాకు చెందిన అమ్మాయిలు మాత్రం విలాసవంతమైన జీవితం కోసం కన్యత్వాన్ని విక్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహ ఘటనలు ఎక్కువగా చోటుచేసుకొంటున్నాయి. ఇందుకు కొంతమంది  యువతులు ‘రైట్‌ టు ది ఫస్ట్‌ నైట్‌' అనే వేదికలకు, డేటింగ్‌ వెబ్‌సైట్లలో తమ కన్యత్వం అమ్మకానికి ప్రకటనలు చేస్తున్నారు. ఇలాంటి వారిని ఆకర్షించడం కోసం దళారులు కూడా క్లబ్బులు ఏర్పాటయ్యాయి..ఆన్‌లైన్‌ ‘బ్యాడ్‌ గర్ల్స్‌ క్లబ్‌' కూడ ఏర్పాటయింది. 19 ఏళ్లలోపు అందమైన అమ్మాయిలు ఆకర్షణీయంగా ఉన్న వాళ్లు కావాలంటూ ఇలాంటి క్లబ్బులో ప్రకటనలు ఇస్తున్నారు. తాము కన్యగానే ఉన్నట్లు వేలంలో పాల్గొనే అమ్మాయిలు అవసరమైన వైద్య సర్టిఫికెట్లను చూపించాల్సి ఉంటుంది. 


రష్యా యువతులు అపార్టుమెంట్లు కొనుక్కోవడానికి, ఒకేసారి ధనవంతులు అయిపోవడానికి తమ కన్యత్వాన్ని వేలం వేస్తున్నారు. ఇదివరకు ఇలా కన్యత్వాన్ని వేలం వేసుకునే కన్యలు ఒకరో, ఇద్దరో ఉండగా ఇప్పుడు వేల మంది యువతులు పోటీపడి మరీ ముందుకు వస్తున్నారని ఓ నివేదిక వెల్లడించింది.కన్యత్వ వేలంపై వెబ్‌సైట్లలో విపరీత ప్రకటనలు గుప్పిస్తున్నాయి. ఫలానా అమ్మాయి కన్యత్వ వేలంలో లక్షలాది రూపాయాలను సంపాదించిందని ప్రకటనలు గుప్పిస్తున్నారు..ఏ రకంగా తాము అమ్మాయిలను ఎంజాయ్ చేశామో ఈ సైట్లలో కొందరు యువకులు పోస్టులు పెడుతున్నారు. కన్యత్వాన్ని వేలం వేసిన వారితో కొన్ని టీవి చానెల్స్ చర్చా కార్యక్రమాలను కూడ నిర్వహిస్తున్నాయి.

కన్యత్వాన్ని వేలం వేసే ప్రక్రియలో దళారుల ఫీజులు కూడ ఎక్కువగానే ఉన్నాయి. దీనితో ఇటు కన్యలను, అటు ధనవంతులను కలిపి కాస్త సొమ్ము సంపాదించేందుకు దళారులు కూడా బయల్దేరారు. దళారుల ఫీజులు కూడా లక్షల రూపాయల్లో ఉంటున్నాయి. దీంతో కొందరు యువతులు ‘రైట్‌ టు ది ఫస్ట్‌ నైట్‌' అనే వేదికలకు, డేటింగ్‌ వెబ్‌సైట్లలో తమ కన్యత్వం అమ్మకానికి ప్రకటనలు చేస్తున్నారు. మరో క్లబ్‌ ‘డెస్పరేట్‌ వర్జిన్స్‌ క్లబ్‌' పేరిట ఏర్పాటయింది.

Related Posts