YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

అమ్మకానికి నెవర్ ల్యాండ్

అమ్మకానికి నెవర్ ల్యాండ్

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ ఎంత ఇష్టపడి, అపురూపంగా కట్టించుకున్న ఇల్లు నెవర్ ల్యాండ్ మరోసారి వేలానికి వచ్చింది. ఈసారి దాని ధరను అత్యంత తక్కువగా రూ.220 కోట్లుగా నిర్ణయించారు. 2015లో ఇదే ఇంటిని రూ.640 కోట్లకు వేలం పెట్టగా... అంత రేటు పెట్టి కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. మళ్లీ ఇప్పుడు తక్కువ రేటుకే వేలం పెడుతున్నట్లు ప్రకటించారు. మరి ఈసారైనా కొనేందుకు ఎవరైనా ముందుకొస్తారో లేదో చూడాలి. నెవర్ ల్యాండ్‌లో ఇల్లు మాత్రమే కాకుండా... ఓ జూ, గార్డెన్, భారీ థియేటర్లు కూడా ఉండటం, అమెరికాలో నిర్మించడం వల్ల ఇప్పటి ధరల ప్రకారం చూస్తే రూ.220 కోట్లంటే తక్కువే అనుకోవచ్చు. అమెరికాలోని శాంటా బార్బరా దగ్గర్లో 2,700 ఎకరాల్లో తన అభిరుచికి తగ్గట్లు ఇంటిని కట్టుకున్నాడు మైఖేల్ జాక్సన్. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ కంటే నెవర్ ల్యాండే పెద్దది. ఎందుకంటే ఫిల్మ్ సిటీని నిర్మించినది 2,000 ఎకరాల్లో. మరి ఇంత పెద్ద ఇంటిని మైఖేల్ ఎందుకు నిర్మించుకున్నాడో తెలిస్తే ఆశ్చర్యం కలగకమానదు.1982లో కట్టిన నెవర్ ల్యాండ్‌లో జూ, గార్డెన్, భారీ థియేటర్లు ఉన్నాయి. ఇవన్నీ మైఖేల్ తన కోసం కట్టించుకోలేదు. చిన్నప్పుడు తండ్రి చేతిలో చిత్ర హింసలు అనుభవించిన మైఖేల్ జాక్సన్... చిన్న పిల్లలెవరికీ తనలా కష్టాలు బాధలూ ఉండకూడదనుకున్నాడు. పిల్లలకు ఎంజాయ్‌మెంట్ కోసమే నెవర్ ల్యాండ్ కట్టించాడు. ప్రతి వారం వందల మంది పిల్లల్ని ఫ్రీగా ఆ ప్రపంచంలోకి ఆహ్వానించేవాడు. వాళ్లు ఆడుకుంటుంటే చూసి ఆనందించేవాడు.ఐతే, మైఖేల్ నెవర్‌ ల్యాండ్‌లో చిన్నారులపై వేధింపులకు పాల్పడ్డాడనీ, అతని మానసిక స్థితి సరిగా లేదనీ రకరకాల ఆరోపణలు వచ్చాయి. దాంతో నెవర్ ల్యాండ్ లోకి పిల్లల్ని వెళ్లనివ్వకుండా కండీషన్లు పెట్టారు. ఇక అప్పటి నుంచీ మైఖేల్ ఒంటరి వాడయ్యాడు. ఆ ఇంట్లో ఒక్కడే ఉంటూ... రోజుల తరబడి అలాగే గడిపేసేవాడు. ఇదే సమయంలో నెవర్ ల్యాండ్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా బాగా పెరిగాయి. దాని నిర్వహణ కోసం ఏకంగా అప్పులు చేసి తిప్పలు పడ్డాడు. ఇలా నెవర్ ల్యాండ్ మైఖేల్ జాక్సన్‌కు ఆనందం కంటే బాధల్నే మిగిల్చింది

Related Posts