YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

మర్చి 23 న  పెద్దల సభ ఎన్నికలు

Highlights

  • ఓటింగ్.. లెక్కింపు అదే రోజు
  • షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
  • ఏప్రిల్‌లో ఖాళీ అవుతున్న 59  సీట్లు
  • ఏపీలో 3.. 
  • తెలంగాణలో 3 స్థానాలు
  • 5న నోటిఫికేషన్.. 
  • 12 వరకు నామినేషన్లు
మర్చి 23 న  పెద్దల సభ ఎన్నికలు


పెద్దల సభకు  ఎన్నికల నగారా మోగింది. మర్చి 23 న  ఏప్రిల్ నాటికి ఖాళీ అవుతున్న 59  రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ మార్చి 5న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 12 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. మార్చి 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు మార్చి 15వరకూ గడువుగా ఎన్నికల సంఘం తెలిపింది. మార్చి 23న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా అదే రోజున జరుగుతుంది. దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాలకు సంబంధించిన 58 మంది రాజ్యసభల పదవీ కాలం ఏప్రిల్‌తో ముగియనుంది.

ఉత్తర ప్రదేశ్-10, బిహార్-6, మహారాష్ట్ర-6, మధ్యప్రదేశ్-5, పశ్చిమ బెంగాల్-5, కర్ణాటక-4, గుజరాత్-4, ఏపీ, తెలంగాణ, ఒడిశా, రాజస్థాన్‌లలో మూడు చొప్పున, జార్ఖండ్-2, ఛత్తీస్‌గఢ్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఒక్కొ స్థానం చొప్పున ఖాళీ అవుతున్నాయి. ఏపీ నుంచి చిరంజీవి, రేణుకా చౌదరి, దేవేందర్ గౌడ్‌లు, తెలంగాణ నుంచి సీఎం రమేశ్, రాపోలు ఆనంద భాస్కర్, పాల్వాయి గోవర్దన్ రెడ్డి(ఇది వరకే చనిపోయారు)ల పదవీ కాలం ఏప్రిల్‌లో ముగుస్తోంది.

అలాగే కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, రవి శంకర్ ప్రసాద్, ధర్మేంద్ర ప్రధాన్, థావర్ చంద్ గెహ్లాట్, రామ్‌దాస్ అతవాలే కూడా రాజ్యసభ సభ్యత్వం కోల్పోతున్నారు. రాజ్యసభ నుంచి విరమణ పొందుతున్న వారిలో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నారు. షెడ్యూల్ విడుదల కావడంతో ఆయా పార్టీలు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి

Related Posts