YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

సన్ రైజర్స్ కు ఎదురు దెబ్బ

సన్ రైజర్స్ కు ఎదురు దెబ్బ

యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:

ఐపీఎల్‌ 2019 సీజన్ ముంగిట సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది కెప్టెన్‌గా జట్టుని నడిపించిన కేన్ విలియమ్సన్‌.. గాయం కారణంగా ఈ ఏడాది ఆరంభ మ్యాచ్‌లకి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్‌తో తాజాగా ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ ఈ న్యూజిలాండ్ కెప్టెన్ గాయపడ్డాడు. వెంటనే.. సమీపంలోని ఆసుపత్రికి అతడ్ని తరలించగా.. చికిత్స చేసిన వైద్యులు స్కానింగ్ తీసిన తర్వాత.. గాయం తీవ్రత దృష్ట్యా కొన్నిరోజులు విశ్రాంతి అవసరమని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో.. శనివారం నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభంకానున్న మూడో టెస్టుకి విలియమ్సన్ దూరంగా ఉండనున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. మార్చి 23 నుంచి అంటే.. మరో 11 రోజుల్లోనే ఐపీఎల్ 2019 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాలో బాల్ టాంపరింగ్‌కి పాల్పడిన డేవిడ్ వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఏడాది నిషేధం విధించడంతో.. 2018 ఐపీఎల్‌కి కెప్టెన్‌గా ఉన్న వార్నర్ దూరమయ్యాడు. దీంతో.. అతని స్థానంలో జట్టు పగ్గాల్ని అందుకున్న కేన్ విలియమ్సన్ గత ఏడాది జట్టుని సమర్థంగా నడిపించి ఏకంగా ఫైనల్‌కి చేర్చాడు. కానీ.. ఫైనల్లో బౌలర్లు తేలిపోవడంతో హైదరాబాద్ జట్టుపై 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 

Related Posts