YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఉగ్రసంస్థల కోసమే టిఆర్ఎఫ్

ఉగ్రసంస్థల కోసమే టిఆర్ఎఫ్

ఢిల్లీ:
పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌‌పై భారత త్రివిధ దళాల అధికారులు స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ గతంలో పార్లమెంట్‌పై దాడి నుంచి తాజాగా జరిగిన పహల్గామ్ దాడి వరకూ మొత్తం 350 మంది పౌరులు మృతి చెందారని చెప్పారు. అలాగే 600 మందికి పైగా సైనికులు మృతిచెందారన్నారు. ఇకపై ఇలాంటివి జరగకుండా ఉండేందుకే ఆపరేషన్ సింధూర్ చేపట్టినట్లు తెలిపారు. పహల్గామ్‌లో పౌరులను విచక్షణారహితంగా కాల్చి చంపారని, ఈ దాడిలో 25 మంది భారతీయ పౌరులు, ఒక నేపాలీ మృతిచెందారని చెప్పారు. పహల్గామ్‌ దాడి అత్యంత హేయమైనదని తెలిపారు. ముంబై దాడుల తర్వాత ఇదే పెద్ద దాడి అని, జమ్మూకశ్మీర్ అభివృద్ధిని అడ్డుకోవడమే ఉగ్రవాదుల పన్నాగమని చెప్పారు.
ఉగ్రవాదాన్ని అరికట్టడంలో ఐరాస విఫలమైందని రక్షణశాఖ అధికారులు పేర్కొన్నారు. టిఆర్ఎఫ్ అనేది లష్కరే తొయిబాకు ఒక ముసుగు వంటిదన్నవారు. ఉగ్రసంస్థల కోసమే టిఆర్ఎఫ్ పనిచేస్తోందన్నారు. నిఘా వ్యవస్థల ద్వారా ఉగ్రదాడులకు పాల్పడ్డవారిని గుర్తించామని చెప్పారు. అంతర్జాతీయ వేదికలపై ప్రపంచ దేశాలను పాక్ తప్పుదారి పట్టిస్తోందని, ఉగ్రవాదానికి పాకిస్థాన్ స్వర్గధామంగా మారిందని దుయ్యబట్టారు. భారత్‌పై రానున్న రోజుల్లో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని.. నిఘా వర్గాలు హెచ్చరించాయన్నారు. ఉగ్రసంస్థల మౌలిక వసతులు ధ్వంసం చేసేందుకే సరిహద్దు దాటి భారత్ దాడి చేసిందని స్పష్టం చేశారు. పహల్గామ్ దాడి తర్వాత పాక్ ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టలేదని తెలిపారు. పహల్గామ్ దాడిలో మరో కుట్ర కూడా ఉందని, కశ్మీర్‌తో పాటూ దేశంలో విధ్వేషాలు రెచ్చగొట్టాలని చూశారని తెలిపారు.
కశ్మీర్‌ను గతేడాది 2.3కోట్ల మంది పర్యాటకులు సందర్శించారని రక్షణశాఖ అధికారులు తెలిపారు. జమ్మూకశ్మీర్ పర్యాటకంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతోందన్నారు. పహల్గామ్ దాడితో ఇదంతా దెబ్బతీయాలని చూశారని చెప్పారు. అందుకే ఉగ్రవాదులకు సరైనరీతిలో బుద్ధి చెప్పామని వివరించారు. పాక్‌లో ఉగ్రసంస్థలు ఉన్నాయని 2023లోనే ఐరాస దృష్టికి తీసుకెళ్లామని గుర్తు చేశారు. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే ఉందన్నారు. ఇక ముందు కూడా ఉగ్రచర్యలను భారత్ ఉపేక్షించదని, దాడులకు పాల్పడేవారిని కచ్చితంగా శిక్షిస్తాంమన్నారు. పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేసిందని, భారత్ చేసిన దాడి బాధ్యతాయుతమైనదంటూ భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు.

Related Posts