
హైదరాబాద్
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి,డీజీపీ జితేందర్,హోమ్ సెక్రటరీ రవి గుప్తా, ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్,ఇతర సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు హజరయ్యారు.