YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
దేశీ స్టాక్ మార్కెట్ ఈ వారంలో వరుసగా రెండో రోజూ భారీ లాభాతోనే ముగిసింది. సెన్సెక్స్‌ 482 పాయింట్ల లాభంతో 37,536 పాయింట్ల వద్ద, నిఫ్టీ 133 పాయింట్ల లాభంతో 11,301 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. సెన్సెక్స్ 2 రోజుల్లో 865 పాయింట్లు ర్యాలీ చేసింది. నిఫ్టీ 266 పాయింట్లు పెరిగింది. కేంద్రంలో తిరిగి ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావొచ్చనే అంచనాలు, ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలు, దేశీ స్టాక్ మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెరగడం, స్మాల్‌క్యాప్స్/మిడ్‌క్యాప్స్‌ జోరు, సాంకేతిక అంశాలు, హెవీ వెయిట్ షేర్లలో కొనుగోళ్లు వంటి అంశాలు మార్కెట్ ర్యాలీకి దోహదపడ్డాయి. 
నిఫ్టీ 50లో భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్అండ్‌టీ, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభపడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2 శాతానికి పైగా పెరిగింది. ఐసీఐసీఐ బ్యాంక్ 3 శాతానికి ఎగసింది. భారతీ ఎయిర్‌టెల్ 5 శాతం ర్యాలీ చేసింది. అదేసమయంలో ఐషర్ మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, హెచ్‌పీసీఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఓఎన్‌జీసీ, ఇన్ఫోసిస్, యస్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. ఐషర్ మోటార్స్ దాదాపు 3 శాతం క్షీణించింది.సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్‌లు మినహా మిగతా ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే క్లోజయ్యాయి. ప్రైవేట్ రంగ బ్యాంకులు, ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు బాగా పెరిగాయి. బ్యాంక్ నిఫ్టీ జీవిత కాల గరిష్టాన్ని నమోదు చేసింది. 

Related Posts