
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
కర్నూలు జిల్లా డోన్ పట్టణ సి ఐ వెంకటరమణ, పోలీసు సిబ్బంది భారీ ఎత్తున నగదును పట్టుకున్నారు. బుధవారం తెల్లవారు జామున డోన్ బై పాస్ కంబాలపాడు రోడ్డు సర్కిల్ వద్ద హైద్రాబాద్ నుండి బెంగళూర్ వెళుతున్న ప్రవేట్ ట్రావెల్స్ బస్ లో చెకింగ్ చేస్తుండగా అర్జున్, అతని ఫ్రెండ్ వద్ద 88 లక్షలా ఇరవై రెండువేలు నగదు, ఒక కేజీ బంగారం ఉన్నట్లు కనుగొన్నారు. సదరు డబ్బుకు ఏలాంటి డాకుమెంట్స్ లేకుండడంతో డోన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ బంగారం , క్యాష్ ను బెంగళూరు లో విజయ్ జ్యూ వెలర్స్ కు సంబంధించినది అని అర్జున్ చూపుతున్న ఆధారం సరిగాలేదని పోలీసులు అంటున్నారు. ఈ మొత్తం ను ఇంకంటాక్స్ డిపార్టుమెంటు కు అప్పచెప్పడం జరుగుతుందని అన్నారు.