YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

ఆడిటింగ్ వ్యవస్థలపై చెరగని చెడు ముద్ర

Highlights

  • అనైతికతకు  చరమగీతం పాడాలి 
  • నీతిమంతమైన వ్యాపారాన్ని అలవరచుకోవాలి: 
  • పిఎన్ బి స్కామ్ పై  స్పందించిన .జైట్లీ
 ఆడిటింగ్ వ్యవస్థలపై చెరగని చెడు ముద్ర

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం లాంటి కుంభకోణాలు ఆడిటింగ్ వ్యవస్థలపై చెరగని చెడు ముద్ర వేస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ఇంత పెద్ద కుంభకోణాలు జరుగుతున్నా ఏ ఒక్కరూ దాని గురించి హెచ్చరించకపోవడం దేశాన్ని ఆందోళనకు గురి చేసే అంశమేనన్నారు. ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2018లో పాల్గొన్న ఆయన.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై స్పందించారు. బ్యాంకింగ్ రంగంలో రుణదాత-గ్రహీతల మధ్య బంధంలో అనైతిక ప్రవర్తనలు అంతమవ్వాలి. నీతిమంతమైన వ్యాపారాన్ని అలవరచుకోవాలి’’ అని ఆయన అన్నారు. కుంభకోణాల నివారణలో నియంత్రణ వ్యవస్థలు మరింత జాగరూకతను పాటించాల్సిన అవసర ముందని, అది చాలా ముఖ్యమని అన్నారు. దురదృష్టవశాత్తూ భారతీయ వ్యవస్థలో ఏదైనా తప్పు జరిగితే రాజకీయ నాయకులపైకి నెట్టేస్తారని, నియంత్రణ సంస్థలను తప్పుబట్టరని చెప్పుకొచ్చారు. 
 కుంభకోణాన్ని అటు రాజకీయ వ్యవస్థగానీ, ఇటు ఆర్థిక శాఖగానీ గుర్తించకపోవడమే ఆందోళన కలిగించే అంశమని  కాంగ్రెస్ నేత కపిల్ సిబల్  అన్నారు. అరుణ్ జైట్లీ వ్యాఖ్యలను అయన ఆక్షేపించారు. కేవలం నియంత్రణ సంస్థలపై నెపాన్ని మోపడం సబబు కాదన్నారు. బ్యాంకుల్లో ప్రభుత్వ నామినీలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. కుంభకోణానికి సంబంధించిన అంశాలపై సమగ్ర దర్యాప్తు అవసరమని, అయితే, బాధ్యతను నియంత్రణ సంస్థలపైకి నెట్టేయడం మంచిది కాదని హితవు చెప్పారు.

Related Posts