YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ జువెలర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఐఎస్‌ఓ ధ్రువీకరణ

 ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ జువెలర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఐఎస్‌ఓ ధ్రువీకరణ

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

 ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ రిటైల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ జువెలర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు  నాణ్యత, పర్యావరణం, ఆరోగ్యం, భద్రత విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వ్యాపార కార్యకలాపాల నిర్వహణ, వ్యవస్థల అనుసంధానానికి గాను ఐఎస్‌ఓ ధ్రువీకరణ పత్రాలు లభించాయి. ఐఎస్‌ఓ 9001 (నాణ్యత), ఐఎస్‌ఓ 14001 (పర్యావరణం) ఐఎస్‌ఓ 45001 (ఆరోగ్యం, భద్రత) ధ్రువీకరణ పత్రాలను సంస్థ డైరెక్టర్లు పి.వి.ఎస్‌.అభినయ్‌, టి.రాకేశ్‌, కల్పేశ్‌ వి జైన్‌కు ఓడీసీ స్టాండర్డ్స్‌ సర్టిఫికేషన్స్‌ ఇండియా ఎండీ పడిగల శేషాద్రి అందజేశారు. ఐఎస్‌ఓ, జీఆర్‌ఐ ప్రమాణాల అమలుతో పాటు 17 సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడం ద్వారా సుస్థిరమైన సంస్థగా అభివృద్ధి చెందడం ప్రస్తుతం ఏ సంస్థకైనా కీలకమని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

Related Posts