
యువ్ న్యూస్ కల్చరల్ బ్యూరో:
పరమశివుడుకైలాసము నుండి దిగివచ్చి, యీ గ్రామంలో ఒక రోజు గడపిన పుణ్యస్ధలం గా జతోలీ గ్రామంలోని శ్రీమహాదేవుని ఆలయం ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయం
సిమ్లా నుండి నలభై ఆరు కి.మీ దూరంలో వున్నది .ఈ జతోలీ గ్రామం హిమాచల్ప్రదేశ్ సోలాన్ జిల్లాలో వున్నది. సముద్ర మట్టానికి సుమారు 5,200 అడుగుల ఎత్తున
పర్వత సముదాయాలతో , ప్రకృతి సౌందర్యంవుట్టిపడుతూ పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగించే అత్యంత సుందర ప్రదేశం.
దుర్గా దేవికి మరో పేరైన శూలిని
అనే పేరుతో ,యీ జిల్లా
సోలాన్ అని పిలువ బడుతోంది. ఈ జిల్లాలోనే శూలిని మాతకి
ప్రత్యేకంగా 'నైనీ'అనే
ప్రదేశం లో ఒక ఆలయం
వుంది. ఆ కాలంలో 'భగత్' వంశం రాజుల రాజధాని గా వ యీ 'సోలాన్' వుండేది.
ఈ జిల్లాలో వున్న
శివాలయంలో వున్న శివుని ఝటా జూటాన్ని
తలపించేలా యీ గ్రామానికి
జతోలీ అనే పేరుతో పాటు
ఆసియాలోనే అత్యంత ఎత్తు ,
సుమారు 110 అడుగులు ఎత్తు
సూర్య విమానం కలిగిన ప్రాచీన
శివాలయంగా పేరు పొందినది.
ఈ ప్రాచీన శివాలయం
గురించి అనేక పురాణ
గాధలు వున్నాయి.
కైలాసము నుండి దిగి వచ్చిన పరమేశ్వరుడు
యిక్కడి ప్రకృతి సౌందర్యానికి
ఆకర్షితుడై, ఒక రాత్రి అంతా
యిక్కడే గడిపి
ఆనందించినట్లు ఐహీకం.
ఇప్పటికి పరమశివుడు
అక్కడనే వున్నట్లు
భక్తుల నమ్ముతారు.
ఈ ఆలయంలో ప్రతిష్టించబడిన జతోలీ మహాదేవుని స్ఫటిక లింగం , ప్రపంచంలో నే
చాలా ప్రాచీనమైన
స్ఫటిక లింగంగా ప్రసిద్ధి
చెందినది. ఉత్తర
మరియు ద్రావిడ దేశ శిల్పశైలిలో నిర్మించిన యీ ఆలయం అంతా అధ్భుత
నగిషీలతో అపూర్వ శిల్పాలతో అందరికీ ఆశ్చర్యానందాలు కలిగిస్తుంది.
ఒకానొకప్పుడు ఎంతో చిన్నది గా వుండే యీ ఆలయం ప్రక్కనే వున్న ఒక గుహలో
శ్రీ కృష్ణానందపరమహంసజీ
అనే యోగి తపమాచరించేవాడు. ఒకరోజు
ఆ జ్ఞాని కలలో మహేశ్వరుడు సాక్షాత్కరించి ఒక పెద్ద
ఆలయాన్ని కొత్తగా కట్టమని ఆదేశించినట్లు, ఆ తర్వాత ముఫ్ఫైతొమ్మిది సంవత్సరాల కఠిన
పరిశ్రమ ,కృషి తో యీ
అద్భుతమైన ఆలయ
నిర్మాణం జరిగినట్లు స్ధల
చరిత్ర చెపుతోంది.
స్వామీజీ తపస్సు
చేసిన గుహ కూడా యిప్పుడు
ఆలయ ఆవరణలో దర్శిస్తాము. ఆలయానికి
ముందు వినాయకుని విగ్రహం, భక్తులకు
దర్శనమిస్తుంది. అందమైన ముఖమండపం దానికి
చివర ఆలయానికి ఎదురుగా నందీ మండపం మధ్య ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన , తెల్లని పెద్ద నందీశ్వరుని విగ్రహం ,
చుట్టూ ప్రమదగణాలుతో కన్పట్టే దృశ్యం అద్భుతం.
ఆలయ ముఖమండపం
తరువాత, ఒక మహామండపం.
గర్భగుడి మీద వున్న
విమానం అపూర్వ శిల్పకళా సంపదతో మైమరపిస్తుంది.
ఒకదాని తర్వాత ఒకటిగా
మూడు శిఖరాలుగా వున్న ఆలయ విమానం మొదటి అంతస్తులో
వినాయకుడు,దాని తరువాత ఐదు తలల
శేషనాగు. తరువాత
111 అడుగుల ఎత్తు గా
ప్రధాన విమానము వున్నాయి. ప్రధాన విమాన మధ్య గోష్టములో
మహాదేవుడు ధ్యానముద్రలో దర్శనమిస్తాడు.
విమానం నలువైపులా
అందమైన శిల్పాలు
వున్నాయి.
గర్భాలయంలో పానువట్టం మీద
స్వయంభూ వైన
జతోలీ శ్రీ మహాదేవుడు
స్ఫటిక లింగం గా దర్శన
భాగ్యం కలుగ చేస్తున్నాడు.
ఈ శివలింగం క్రింద భాగాన్ని
బ్రహ్మ భాగమని, మధ్యభాగమును
విష్ణు పీఠమని,పైభాగమును శివ పీఠమని పిలుస్తారు.
మూలమూర్తికి వెనుక
భాగమున, వేదిక మీద
మహాదేవుడు, పార్వతీ దేవి, మహావిష్ణువు,
హనుమంతునీ విగ్రహాలు
ప్రతిష్టించి వున్నాయి.
ఆలయ ఈశాన్య భాగంలో 'జలకుండ్'
అనే పుష్కరిణి వున్నది.
ఆ పుష్కరిణిలోని జలం గంగా
జలంతో సమానమై
మహిమాన్వితమైనదని చెప్తారు.
ఈ పుణ్య జలం చర్మవ్యాధులను నయం
చేసే దివ్య ఔషధంగా
భక్తులు నమ్ముతారు.
మహాశివరాత్రి రోజున యీ ఆలయ ప్రదేశంలో
ఒక పెద్ద జాతర ఘనంగా
జరుగుతుంది.
46 కి.మీ దూరంలో వున్న సిమ్లా తదితర ప్రాంతాలనుండి యాత్రికులు తండోపతండాలుగా తరలివచ్చి యీ జాతరలో ఉత్సాహంగా పాల్గొంటారు.