
యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
సన్‌రైజర్స్‌కు పంజాబ్ పంచ్ ఇచ్చింది. ఆ జట్టు సమష్టిగా ఆడిన వేళ 6 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. సోమవారం మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 150 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (70 నాటౌట్; 62 బంతుల్లో 6×4, 1×6) మరోసారి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రాహుల్‌తో పాటు మయాంక్ అగర్వాల్ (55; 43 బంతుల్లో 3×4, 3×6) కూడా సత్తా చాటడంతో లక్ష్యాన్ని పంజాబ్ 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.